హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Big Billion Days Sale: సూపర్ డూపర్ ఆఫర్.. రూ.57,999 ఫోన్ రూ.27 వేలకే కొనండి!

Big Billion Days Sale: సూపర్ డూపర్ ఆఫర్.. రూ.57,999 ఫోన్ రూ.27 వేలకే కొనండి!

రియల్‌మీ జీటీ 2 ఫోన్

రియల్‌మీ జీటీ 2 ఫోన్

Flipkart Offers | మీరు కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకోసం ఒక సూపర్ డూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Flipkart Big Billion Days | మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రీమియం ఫోన్ కొనాలని భావిస్తే మాత్రం మీకోసం క్రేజీ డీల్ వేచి చూస్తోంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

  కస్టమర్లు రియల్‌మి జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 26,999కే కొనొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 57,999. బిగ్ బ్యాంగ్ రివీల్ ఆఫ్ ద డే మైక్రోసైట్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ ఈ వివరాలను వెల్లడించింది. ఇకపోతే రియల్‌మి జీటీ 2 ప్రో లిస్టింగ్ ధర అయితే ఏకంగా రూ. 60 వేలకు పైనే ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 57,999. దీన్ని కస్టమర్లు కేవలం రూ. 26,999కే కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్లు కలుపుకొని ఈ డిస్కౌంట్ ధర ఉంటుంది.

  క్రేజీ డీల్.. రూ.35 వేల స్మార్ట్ వాచ్‌ రూ.2,999కే! శాంసంగ్ ఫోన్ ఆఫర్‌తో

  రియల్‌మి జీటీ 2 ప్రో అనేది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ . దీన్ని 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ వేరియంట్ల రూపంలో కొనొచ్చు. 256 జీబీ వరకు మెమరీ ఉంటుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర అయితే రూ. 49,999గా ఉంది. అలాగే 12 జీబీ + 256 జీబీ వేరియంట్ రేటు ప్రస్తుతం రూ. 57,999గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆఫర్ రేటుకు ఈ ఫోన్ కొనాలని భావిస్తే.. బిగ్ బిలియన్ డేస్ సేల్ వరకు ఆగాల్సిందే.

  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ను మించేలా షావోమి దద్ధరిల్లే ఆఫర్లు.. ఉచితంగానే టీవీలు, స్మార్ట్‌ఫోన్స్

  రియల్ మి జీటీ 2 ప్రో ఫోన్‌లో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు ఉంది. పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంటుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ అమర్చింది. అండ్రాయిడ్ 12 ఓఎస్‌పై ఫోన్ పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 5జీ ఫీచర్ కూడా ఉంది. అధిక బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకత. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

  ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ కెమెరా సెటప్ ఉంది. కంపెనీ ట్రిపుల్ కెమెరాను అమర్చింది. 50 ఎంపీ ప్రైమరీ, 50 ఎంపీ సెకండరీ సెన్సార్, 2 ఎంపీ మైక్రో లెన్స్ కెమెరా ఉంది. సెల్ఫీ వీడియో, వీడియో కాలింగ్‌కు 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చింది. ఈ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తోంది. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, బ్లాక్ అనే రంగుల్లో ఫోన్ ఉంటుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Realme

  ఉత్తమ కథలు