హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme GT 2 Pro: ఈ నెలాఖరులోగా భారత మార్కెట్​లోకి రియల్​మీ జీటీ2 ప్రో లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

Realme GT 2 Pro: ఈ నెలాఖరులోగా భారత మార్కెట్​లోకి రియల్​మీ జీటీ2 ప్రో లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రియల్​మీ జీటీ 2 ప్రో మొత్తం రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​తో పాటు 12GB ర్యామ్​, 256GB స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది​.

ప్రముఖ స్మార్ట్​ఫోన్(Smart Phone)​ తయారీ సంస్థ రియల్​మీ వరుస స్మార్ట్​ఫోన్ల లాంచింగ్​తో భారత్​లో(Bharath) హవా కొనసాగిస్తుంది. తాజాగా నిర్వహించిన MWC 2022 ఈవెంట్​లో రియల్​మీ జీటీ 2 ప్రో స్మార్ట్​ఫోన్​ను యూరోపియన్‌ మార్కెట్​లోకి ఆవిష్కరించింది. చైనా వెలుపల రియల్​మీ నుంచి విడుదలైన మొదటి అల్ట్రా -ప్రీమియం స్మార్ట్​ఫోన్​ ఇదే కావడం విశేషం. అయితే, ఈ స్మార్ట్​ఫోన్​ ఇంకా భారత మార్కెట్​లోకి విడుదల కాలేదు. ఈ నెలాఖరులోగా దీన్ని ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. రియల్​మీ(Realme) జీటీ2 ప్రో లాంచింగ్​ మార్చిలో ఎప్పుడైనా జరగవచ్చని గతంలో అనేక నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్​లోకి తీసుకురానున్నట్లు రియల్‌మీ ఈ ఏడాది ప్రారంభంలోనే ధ్రువీకరించింది.

MySmartPrice నివేదిక ప్రకారం, రియల్​మీ జీటీ2 ప్రో ఈ నెలలోనే లాంచ్ అవ్వనుంది. అయితే, లాంచింగ్​ డేట్​పై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనప్పటికీ, రియల్​మీ జీటీ 2 ప్రో మొత్తం రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​తో పాటు 12GB ర్యామ్​, 256GB స్టోరేజ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది​. ఇక, ఈ రెండు వేరియంట్లు స్టీల్ బ్లాక్, పేపర్ వైట్, పేపర్ గ్రీన్ కలర్​ ఆప్షన్లలో లభిస్తాయి.

Smartphone Offer: ఒక Moto ఫోన్ కొంటే మరొకటి ఫ్రీ.. Motorola బంపరాఫర్.. వివరాలివే

రియల్​మీ తొలి అల్ట్రా ప్రీమియం స్మార్ట్​ఫోన్​..

భారతదేశంలో GT 2 ప్రోని ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని రియల్‌మే ఇంకా ధృవీకరించలేదు. అయితే, రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ షేత్ జీటీ 2 ప్రో లాంచింగ్ గురించి గతంలో కొన్ని లీకులిచ్చారు. త్వరలోనే రియల్​మీ నుంచి అత్యంత ఖరీదైన, ప్రీమియం స్మార్ట్​ఫోన్​ను రిలీజ్​ కానుందని హింట్ ఇచ్చారు​. దీన్ని బట్టి రియల్​మీ జీటీ2 ప్రో లాంచింగ్​ దాదాపు ఖరారైందనే చెప్పవచ్చు. ఇక, ఆన్​లైన్​లో లీకైన సమాచారం ప్రకారం, రియల్​మీ జీటీ2 ప్రో AMOLED ప్యానెల్‌తో కూడిన QHD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్​ 1 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో ఆప్టికల్ ఇమేజ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్‌ కెమెరాను అందించనుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.

Windows 11: అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. అంత‌కు మించి యూజ‌ర్ ఫ్రెండ్లీ.. విండోస్ 11 ప్ర‌త్యేక‌త‌లు!

ధర ఎంతంటే?

సాధారణంగా, ఈ ప్రీమియం స్పెసిఫికేషన్‌లన్నింటినీ దాదాపు రూ. 60,000 వేల ధరలోని ఫోన్లలోనే లభిస్తాయి. అయితే, యూరప్‌లో రియల్​మీ జీటీ2 ప్రో EUR 649 (దాదాపు రూ. 55,000) వద్ద ప్రారంభమైంది. కానీ, చైనాలో మాత్రం ఈ ఫోన్ ధర CNY 3,899 (దాదాపు రూ. 45,800) వద్ద ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారతీయ వేరియంట్​ ధర చైనీస్ వేరియంట్​ ధర కంటే ఎక్కువగా ఉండనుంది. కానీ కచ్చితంగా యూరోపియన్ వేరియంట్​ కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు