Realme Dizo Buds Z: డిజో బడ్స్-జెడ్.. రియల్‌మీ నుంచి తక్కువ ధరలోనే అదిరిపోయే ఇయర్ బడ్స్..

ప్రతీకాత్మక చిత్రం

Realme Dizo Buds Z: ఈ ఇయర్‌బడ్స్​ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4.5 గంటల ప్లేబ్యాక్​ అందిస్తాయి. ఈ TWS హెడ్‌ఫోన్‌లు 'న్యాచురల్ లైట్' డిజైన్‌ను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ రియల్​మీ  (Realme) మన దేశంలో రకరకాల ఉత్పత్తులను లాంచ్​ చేస్తోంది. తాజాగా ఈ సంస్థ ‘రియల్‌మీ డిజో బడ్స్ జెడ్‌’ (Realme Dizo Buds Z) పేరుతో సరికొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్​) ఇయర్​బడ్స్​ (EarBuds)ను లాంచ్​ చేసింది. తమ పార్ట్నర్ సంస్థ అయిన డిజో (Dizo)తో కలిసి రియల్‌మీ వీటిని రూపొందించింది. సరసమైన ధరలోనే వీటిలో అద్భుతమైన ఫీచర్లు జోడించింది. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్​లో బాస్ బూస్ట్+ అల్గారిథంతో కూడిన 10mm డైనమిక్ డ్రైవర్లను అందించింది. కాల్స్ సమయంలో యాక్టివేట్ చేయడానికి ఎన్విరాన్​మెంటల్​ నాయిస్​ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీతో వీటిని డిజైన్​ చేసింది. ఇది అద్భుతమైన గేమింగ్, స్ట్రీమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. రియల్​మీ డిజో బడ్స్ జెడ్​ మొత్తం 16 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తాయి.

* రియల్​మీ డిజో బడ్స్​ Z ధర, లభ్యత

భారతదేశంలో రియల్​మీ డిజో బడ్స్​ జెడ్​ రూ. 1,999 వద్ద అందుబాటులో ఉంటుంది. అయితే, అక్టోబర్ 7 న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్​లో దీన్ని కేవలం రూ. 1,299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. డిజో బడ్స్​ జెడ్​ ఇయర్‌బడ్స్​ లీఫ్​, ఒనిక్స్​, పెర్ల్​ అనే మొత్తం మూడు కలర్​ ఆప్షన్లలో లభిస్తాయి.

Oppo Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 10 ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు  డిస్కౌంట్

రియల్‌మీ డిజో బడ్స్ Z స్పెసిఫికేషన్లు

రియల్‌మి డిజో బడ్స్ Z టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్​ ENC ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఇది వాయిస్ కాలింగ్​ సమయంలో ఈ ఫీచర్​ యాక్టివేట్ అవుతుంది. ఇయర్​బడ్స్​ డయాఫ్రాగమ్​ను TRU+PEEK పాలిమర్ మిశ్రమంతో తయారు చేశారు. తద్వారా డెప్త్​ బాస్‌తో పాటు స్పష్టమైన ఆడియోను ఎక్స్​పీరియన్స్​ చేయవచ్చు. దీనిలోని ప్రతి ఇయర్‌బడ్‌ 43mAh బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. ఛార్జింగ్ కేస్ 380mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మొత్తం 16 గంటల ప్లే బ్యాక్​ సమయాన్ని ఇస్తుంది.

Redmi 9 Activ: సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ఫీచర్స్ ఇవే

ఈ ఇయర్‌బడ్స్​ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4.5 గంటల ప్లేబ్యాక్​ అందిస్తాయి. ఈ TWS హెడ్‌ఫోన్‌లు 'న్యాచురల్ లైట్' డిజైన్‌ను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇది బ్లూటూత్ v5 కనెక్టివిటీతో వస్తుంది. కాల్స్​, మీడియా ప్లేబ్యాక్, గేమ్ మోడ్‌ కోసం ప్రతి ఇయర్‌బడ్‌లో టచ్ కంట్రోల్​ను అందించారు. ఆండ్రాయిడ్​ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉన్న రియల్​మీ లింక్ యాప్ ద్వారా డిజో బడ్స్​ జెడ్​ ఇయర్​బడ్స్​ను కంట్రోల్​ చేయవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published: