Realme Days Sale: రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

Realme Days Sale | ఎంపిక చేసిన ఫోన్లను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొంటే అదనంగా 10% డిస్కౌంట్ పొందొచ్చు.

news18-telugu
Updated: August 19, 2019, 12:39 PM IST
Realme Days Sale: రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
Realme Days Sale: రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
news18-telugu
Updated: August 19, 2019, 12:39 PM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? శుభవార్త. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లతో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సేల్ ఆగస్ట్ 22 వరకు కొనసాగుతుంది. రియల్‌మీ 3, రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ సీ2, రియల్‌మీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది కంపెనీ. ఇప్పటివరకు ఫ్లాష్ సేల్‌లో అమ్మిన రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌‌ఫోన్‌ను ఓపెన్ సేల్‌లో అమ్ముతోంది కంపెనీ. ఇక రియల్‌మీ 3ఐ సేల్ ఆగస్ట్ 20న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఆగస్ట్ 20న రియల్‌మీ 5 సిరీస్‌లో రియల్‌మీ 5, రియల్‌మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కానుండటంతో పాత ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది కంపెనీ. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన ఫోన్లను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొంటే అదనంగా 10% డిస్కౌంట్ పొందొచ్చు.



Loading...

రియల్‌మీ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇవే...


Realme 3 Pro: రియల్‌మీ 3 ప్రో 4జీబీ+64జీబీ ధర రూ.12,999 కాగా 6జీబీ+64జీబీ ధర రూ.14,999.
Realme C2: రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+16జీబీ ధర రూ.5,999 కాగా 3జీబీ+32జీబీ ధర రూ.6,999.
Realme 3: రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.9,999.
Realme 2 Pro: రియల్‌మీ 2 ప్రో 4జీబీ+64జీబీ ధర రూ.10,490 కాగా 6జీబీ+64జీబీ ధర రూ.12,490.
Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ ధర రూ.16,999 కాగా 8జీబీ+128జీబీ ధర రూ.19,999.
Realme 3i: రియల్‌మీ 3ఐ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ ధర రూ.7,999 కాగా 4జీబీ+64జీబీ ధర రూ.9,999.

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Alert: ఈ 85 ఫోటో, గేమింగ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? జాగ్రత్త... యాప్స్ లిస్ట్ ఇదే

Realme 5: కెమెరాలు 4, బ్యాటరీ 5,000 ఎంఏహెచ్... ధర రూ.10 వేల లోపే

Flipkart Videos: గుడ్ న్యూస్... ఫ్లిప్‌కార్ట్‌లో సినిమాలు వచ్చేశాయి
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...