హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme C55: రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి ఫీచర్‌తో రియల్‌మీ C55 లాంచ్..

Realme C55: రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్.. ఐఫోన్ లాంటి ఫీచర్‌తో రియల్‌మీ C55 లాంచ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రియల్‌మీ కంపెనీ రూ.11 వేలలోపు ధరతో రియల్‌మీ సీ55 (Realme C55) బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీంట్లో ఆఫర్ చేసిన 'మినీ క్యాప్సూల్ (Mini Capsule)' ఫీచర్ ఐఫోన్లలోని డైనమిక్ ఐలాండ్ ఇంటర్‌ఫేస్‌ను పోలి ఉండటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

రియల్‌మీ (Realme) కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మన దేశంలో రూ.11 వేలలోపు ధరతో రియల్‌మీ సీ55 (Realme C55) బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ C55లో ఆఫర్ చేసిన 'మినీ క్యాప్సూల్ (Mini Capsule)' ఫీచర్ ఐఫోన్లలోని డైనమిక్ ఐలాండ్ ఇంటర్‌ఫేస్‌ను పోలి ఉండటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఫీచర్ బ్యాటరీ, స్టెప్ కౌంట్, డేటా యూసేజ్‌కి సంబంధించి నోటిఫికేషన్లను చూపిస్తుంది. మరిన్నిటిని రియల్‌మీ త్వరలోనే యాడ్ చేయనుంది.

ఈ డైనమిక్ ఐలాండ్ ఎంతలా పాపులర్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఆకర్షణీయమైన ఫీచర్ ఇందులో అందించడం విశేషం. ఇంకా ఈ ఫోన్‌లో అందించిన ఫీచర్లు ఏవి, ధరెంత వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మీ C55 ఫీచర్లు

రియల్‌మీ C55 ఫుల్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేను ఆఫర్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz వరకు ఉంటుంది. రియల్‌మీ C55 MediaTek Helio G88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 5G నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేయదని గమనించాలి. ఇండియాలో 5G సర్వీసులు ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రూ.11 వేల బడ్జెట్‌లో 5G మొబైల్‌కి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ కాకపోవచ్చు.

రియల్‌మీ C55 4GB, 6GB, 8GB RAM ఆప్షన్స్‌తో లాంచ్ అయ్యింది. 64GB, 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఇందులో అందించారు. అలానే 1TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కి సపోర్ట్ చేసే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఆఫర్ చేశారు. దీనిలో LPDDR4X RAM, EMMC 5.1 స్టోరేజ్ ఉంటుంది.

స్లిమ్ డిజైన్‌తో అట్రాక్టివ్‌గా కనిపించే ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో సన్‌షవర్ ఫినిషింగ్‌ ఉంటుంది. ప్లాస్టిక్ బాడీతో వచ్చే రియల్‌మీ C55 బరువు 190 గ్రాముల కంటే తక్కువ ఉంటుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక రెండు కెమెరాలు అందించగా అందులో 64MP మెయిన్ కెమెరా హైక్వాలిటీ ఫొటోలను తీస్తుంది. రెండో కెమెరాగా 2MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ముందు 8MP కెమెరా అందించారు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0పై నడుస్తుంది. ఫోన్ 5,000mAh బ్యాటరీ కెపాసిటీ, 33W SuperVOOC వైర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. ఇక మినీ క్యాప్సూల్ ఫీచర్ వినియోగించడానికి యూజర్లు సెట్టింగ్స్‌> Realme Labsకు వెళ్లి Mini Capsule ఫీచర్ ఆన్ చేసుకోవచ్చు.

School Holidays: విద్యార్థులకు శుభవార్త.. రెండు రోజులు సెలువులు..

* రియల్‌మీ C55 ధర

ఇండియాలో మార్చి 28, మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రియల్‌మీ C55 ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. దీని ధరలు రూ.10,999 నుంచి ప్రారంభమవుతాయి. ఫోన్ సన్ షవర్, రైనీ నైట్ అనే రెండు ఫినిషింగ్స్‌లో లభిస్తుంది. మూడు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లను అందిస్తుంది. అయితే బేస్ మోడల్ అయిన 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999కే దొరుకుతుంది. 6GB RAM+64GB వేరియంట్ ధర రూ. 11,999 కాగా 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వచ్చే టాప్-ఎండ్ మోడల్ ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది.

First published:

Tags: 5g mobile, 5g technology, Realme, Technology

ఉత్తమ కథలు