ఐఫోన్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డైనమిక్ ఐల్యాండ్ (Dynamic Island) ఫీచర్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. అలాంటి ఫీచర్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ (Third Party Apps) ఉపయోగిస్తున్నవారు ఉన్నారు. ఇటీవల రియల్‌మీ ఇండియా అలాంటి ఫీచర్‌ను బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో పరిచయం చేయడం విశేషం. లేటెస్ట్‌గా రిలీజైన రియల్‌మీ సీ55 (Realme C55) మొబైల్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. మినీ క్యాప్సూల్ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ సీ55 స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత, ప్రత్యేకతలేంటీ, ఇతర ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అన్న వివరాలు తెలుసుకోండి.
రియల్‌మీ సీ55 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. సన్‌షవర్, రెయినీ నైట్ కలర్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 28 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కొనొచ్చు.
JioFiber Plan: కేవలం రూ.198 కే జియోఫైబర్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
The day has finally arrived! The #EntertainmentKaChampion sale goes live today at 12 noon! Get ready to experience a new era of fun and entertainment with the #realmeC55 starting at ₹10,499*/-@Flipkart
Know more: https://t.co/zh2ot7Okis pic.twitter.com/KIWPuHa73p — realme (@realmeIndia) March 28, 2023
రియల్‌మీ సీ55 స్పెసిఫికేషన్స్
రియల్‌మీ సీ55 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, ఇన్ఫీనిక్స్ నోట్ 12 లాంటి మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. రియల్‌మీ సీ55 ఆండ్రాయిడ్ 13 + రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 8జీబీ వేరియంట్ మొబైల్‌లో ర్యామ్‌ను 16జీబీ వరకు పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
రియల్‌మీ సీ55 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో ఫోటో, AI బ్యూటీ, ఫిల్టర్, AI సీన్ రికగ్నిషన్, నైట్ మోడ్, ప్రొఫెషనల్, పనోరమిక్ వ్యూ, పోర్ట్రెయిట్ మోడ్, స్ట్రీట్, HDR, 64MP మోడ్, స్టారీ, క్రోమా బూస్ట్, బోకే ఫ్లేర్ పోర్ట్రెయిట్, AI కలర్ పోర్ట్రెయిట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
AC Buying Guide: ఏసీలో ఎన్ని రకాలు? మీ ఇంటికి ఏది కరెక్ట్? తెలుసుకోండి
రియల్‌మీ సీ55 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో ఫోటో, బ్యూటీ, ఫిల్టర్, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే డ్యూయెల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.2 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Realme, Realme UI, Smartphone