REALME C35 SMARTPHONE LAUNCHED IN INDIA WITH UNISOC T616 PROCESSOR AND IPHONE LIKE DESIGN KNOW PRICE AND SPECS SS
Realme C35: ఐఫోన్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర ఎంతంటే
Realme C35: ఐఫోన్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర ఎంతంటే
(image: Realme India)
Realme C35 | తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్మీ నుంచి ఐఫోన్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్మీ సీ35 (Realme C35) లాంఛ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు (Budget Smartphones) ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కొత్తగా స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్లు బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌తో ఎంట్రీ ఇస్తారు. ఇక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవాళ్లు సెకండరీ స్మార్ట్‌ఫోన్‌గా బడ్జెట్ మొబైల్ ఉపయోగిస్తుంటారు. అలాంటివారిని టార్గెట్ చేస్తూ కంపెనీలు కొత్తకొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. రియల్మీ ఇండియా కూడా రియల్మీ సీ35 (Realme C35) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. అదిరిపోయే ఫీచర్స్‌తో బడ్జెట్ మొబైల్‌ను పరిచయం చేసింది. ఇందులో సరికొత్త ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సోనీ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.
రియల్మీ సీ35 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. గ్లోయింగ్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. మార్చి 12న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్మీ అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఇప్పటికే ఈ బడ్జెట్లో మార్కెట్లో ఉన్న సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్, రెడ్మీ 10 ప్రైమ్ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
రియల్మీ సీ35 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్ లాగా ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో రిలీజైన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. మైక్రోఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
రియల్మీ సీ35 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + మ్యాక్రో లెన్స్ + బ్లాక్ అండ్ వైట్ లెన్స్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ముందువైపు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉండటం విశేషం. కెమెరాలో ల్యాప్స్, ప్రో, పనోరమా, మ్యాక్రో, నైట్ ప్రో, పోర్ట్రైట్, హెచ్డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రియల్మీ సీ35 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ ఆర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే బ్లూటూత్ 5, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డ్యూయెల్ సిమ్, ఎస్డీ కార్డ్ స్లాట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.