ఓ మంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) కొనాలనుకునేవారి కోసం రియల్‌మీ ఇండియా నుంచి మరో కొత్త మొబైల్ లాంఛ్ అయింది. రూ.10,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ సీ33 2023 ఎడిషన్ (Realme C33 2023 edition) లాంఛ్ చేసింది కంపెనీ. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. యూనిసోక్ ప్రాసెసర్, హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెండు వేరియంట్లలో రియల్‌మీ సీ33 2023 లాంఛ్ అయింది. ప్రారంభ ధర రూ.9,999 మాత్రమే. బ్యాంక్ ఆఫర్స్‌తో ధర ఇంకా తగ్గుతుంది. మరి ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, రియల్‌మీ సీ33 2023 ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.
రియల్‌మీ సీ33 2023 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. ఆక్వా బ్లూ, నైట్ సీ, సాండీ గోల్డ్ కలర్స్‌లో కొనొచ్చు. సేల్ ప్రారంభమైంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
రియల్‌మీ సీ33 2023 స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్, రియల్‌మీ సీ33, రియల్‌మీ సీ31 మొబైల్స్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ పనిచేస్తుంది. ఈ మొబైల్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
రియల్‌మీ సీ33 2023 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + ఏఐ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP మోడ్, బ్యూటీ, ఫిల్టర్, HDR, పనోరమిక్ వ్యూ, పోర్ట్రెయిట్, టైమ్‌లాప్స్, ఎక్స్‌పర్ట్, సూపర్ నైట్ లాంటి కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Mobile Price Cut: ఈ మొబైల్ ధర భారీగా తగ్గింది... ఇప్పుడు రూ.9,999 ధరకే కొనొచ్చు
రియల్‌మీ నుంచి గతేడాది రియల్‌మీ సీ33 లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ కూడా రూ.10,000 లోపే లభిస్తోంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, Unisoc T612 ప్రాసెసర్క, 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Realme, Smartphone