Home /News /technology /

REALME C31 SMARTPHONE LAUNCHED IN INDIA WITH UNISOC T612 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Realme C31: రియల్‌మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.10,000 లోపే

Realme C31: రియల్‌మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.10,000 లోపే
(image: Realme India)

Realme C31: రియల్‌మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.10,000 లోపే (image: Realme India)

Realme C31 | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) లాంఛ్ అయింది. రియల్‌మీ సీ31 మోడల్ రిలీజైంది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) రిలీజైంది. రియల్‌మీ సి సిరీస్‌లో కొత్త మొబైల్ లాంఛ్ అయింది. రియల్‌మీ సీ31 (Realme C31) మోడల్‌ను పరిచయం చేసింది. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ సీ31 ప్రారంభ ధర రూ.8,999 మాత్రమే. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 6న సేల్ ప్రారంభం అవుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనొచ్చు. డార్క్ గ్రీన్, లైట్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో రియల్‌మీ నార్జో 50ఐ, పోకో సీ3 లాంటి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వనుంది రియల్‌మీ సీ31.

    రియల్‌మీ సీ31 స్పెసిఫికేషన్స్


    రియల్‌మీ సీ31 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గతంలో యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌తో రియల్‌మీ సీ35 రిలీజైన సంగతి తెలిసిందే. రియల్‌మీ సీ31 స్మార్ట్‌ఫోన్‌లో యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను పరిచయం చేసింది కంపెనీ. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

    Poco X4 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.6,549 ధరకే... ఆఫర్ కొద్దిరోజులే


    రియల్‌మీ సీ31 స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ ఏఐ సెన్సార్ + 2మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ + మోనోక్రోమ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో మోడ్, బరస్ట్, ఫిల్టర్, టైమ్ ల్యాప్స్, ప్రో, పనోరమా, మ్యాక్రో, నైట్ ప్రో, పోర్ట్‌రైట్, హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో హెచ్‌డీఆర్, బ్యూటీ మోడ్, ఫిల్టర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Exchange Offer: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.3,999 ధరకే సొంతం చేసుకోవచ్చు

    రియల్‌మీ సీ31 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయెల్ సిమ్ + మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Realme, Smartphone

    తదుపరి వార్తలు