హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme: రియల్‌మీ నుంచి బడ్జెట్ మొబైల్ వచ్చేసింది... ధర రూ.7,499 మాత్రమే

Realme: రియల్‌మీ నుంచి బడ్జెట్ మొబైల్ వచ్చేసింది... ధర రూ.7,499 మాత్రమే

Realme: రియల్‌మీ నుంచి బడ్జెట్ మొబైల్ వచ్చేసింది... ధర రూ.7,499 మాత్రమే
(image: Realme India)

Realme: రియల్‌మీ నుంచి బడ్జెట్ మొబైల్ వచ్చేసింది... ధర రూ.7,499 మాత్రమే (image: Realme India)

Realme C30s | భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.10,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 10000) మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. రియల్‌మీ సీ సిరీస్‌లో రియల్‌మీ సీ30ఎస్ (Realme C30s) రిలీజైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రియల్‌మీ ఇండియా పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై (Budget Smartphones) దృష్టిపెట్టింది. రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ (Realme Narzo 50i Prime) లాంఛ్ చేసిన మరుసటి రోజే రియల్‌మీ సీ30ఎస్ (Realme C30s) మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇది కూడా ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయినా డిజైన్ అద్భుతంగా ఉంది. రియల్‌మీ సీ30ఎస్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. సెప్టెంబర్ 23న సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతుంది. స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

రియల్‌మీ సీ30ఎస్ ఫీచర్స్

రియల్‌మీ సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. UNISOC SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ, ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5 ప్రో, ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 6, రియల్‌మీ నార్జో 50ఐ లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది.

Nokia Phone: తగ్గేదే లే అంటున్న నోకియా ... ఫోన్‌లోనే బిల్ట్ ఇన్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌తో సంచలనం

రియల్‌మీ సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డ్యూయెల్ సిమ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రియల్‌మీ సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 8మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. కెమెరాలో బ్యూటీ ఫిల్టర్, హెచ్‌డీఆర్, పనోరమిక్ వ్యూ, పోర్ట్‌రైట్, టైమ్‌ల్యాప్స్, ఎక్స్‌పర్ట్ మోడ్, సూపర్ నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ఉంది. బ్యూటీ ఫిల్టర్, హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Big Billion Offer: ఈ పాపులర్ మొబైల్‌పై ఒకేసారి రూ.5,000 డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్

ఒక రోజు క్రితమే రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ మొబైల్ రిలీజైంది. ప్రారంభ ధర రూ.7,999. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, Unisoc T612 ప్రాసెసర్, 8మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు అదే బడ్జెట్‌లో రియల్‌మీ సీ30ఎస్ మొబైల్ రిలీజైంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్‌లో అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్‌లో రియల్‌మీ పోటాపోటీగా మొబైల్స్ రిలీజ్ చేస్తోంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Flipkart Big Billion Days, Realme

ఉత్తమ కథలు