హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme C30: లో కాస్ట్.. బెస్ట్ ఫీచర్ ఫోన్ లాంచ్.. ఎంట్రీ లెవల్‌తో వస్తున్నరియల్‌మీ C30

Realme C30: లో కాస్ట్.. బెస్ట్ ఫీచర్ ఫోన్ లాంచ్.. ఎంట్రీ లెవల్‌తో వస్తున్నరియల్‌మీ C30

తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లతో వస్తున్న రియల్ మీ

తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లతో వస్తున్న రియల్ మీ

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. రియల్‌మీ సీ30 (Realme C30) పేరుతో ఎంట్రీ-లెవల్ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. రియల్‌మీ C31, రియల్‌మీ C35 మోడళ్ల కంటే తక్కువ ధరలో ఈ ఫోన్ లభించనుంది.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. రియల్‌మీ సీ30 (Realme C30) పేరుతో ఎంట్రీ-లెవల్ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. రియల్‌మీ C31, రియల్‌మీ C35 మోడళ్ల కంటే తక్కువ ధరలో ఈ ఫోన్ లభించనుంది. రూ.10,000 లోపు ధరల విభాగంలో బెస్ట్ డిజైన్, భారీ 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో కొత్త ఫోన్ రిలీజ్ అయింది. ఇండియాలో రియల్‌మీ C30 ధర రూ. 7,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇది జూన్ 27 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.

ఇండియాలో రియల్‌మీ C30 ధర

మొదటిసారి స్మార్ట్‌ఫోన్ వాడే వారికి రియల్‌మీ C30 ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. ఈ డివైజ్ రెండు స్టోరేజ్ వెర్షన్లలో లభిస్తుంది. 2GB RAM, 32GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.7,499 నుంచి ప్రారంభమవుతుంది. 3GB RAM, 32GB స్టోరేజ్‌ వెర్షన్ రూ. 8,299కు లభిస్తుంది. ఈ ఫోన్ జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి Realme.com, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని ప్రధాన రిలైట్ ఛానెల్‌లలో అమ్మకానికి రానుంది. రియల్‌మీ నుంచి ‘C’ సిరీస్‌లో ఇప్పటికే కొన్ని మోడళ్లు లాంచ్ అయ్యాయి. రియల్‌మీ C31 ఫోన్ 3GB/32GB ధర రూ. 9,299, 4GB/64GB వెర్షన్ ధర రూ. 9,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: సైబీరియాలో చైనా పైచేయి సాధించాలని చూస్తోందా? రష్యాతో చైనా యుద్ధం తప్పదా..?


రియల్‌మీ C30 స్పెక్స్, ఫీచర్లు

రియల్‌మీ C30 ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీని వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌లో 5MP సెల్ఫీ షూటర్ ఉంది. అయితే దీని ప్యానెల్ రకం లేదా స్క్రీన్ ప్రొటెక్షన్ వివరాలను కంపెనీ పూర్తిగా వెల్లడించలేదు. ఈ ఫోన్ 8-కోర్ 12nm యూనిసాక్ T612 చిప్‌సెట్‌తో వస్తుంది. రియల్‌మీ C31 మోడల్‌లో కూడా ఇదే చిప్ ఉంటుంది. ఈ ఫోన్‌తో గరిష్టంగా 3GB RAM, 32GB UFS2.2 స్టోరేజ్ పొందవచ్చు. స్పెషల్ మైక్రో-SD కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించవచ్చు.

సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. రియల్‌మీ C30 ఫోన్ ఆండ్రాయిడ్11-బేస్డ్ Realme UI Go ఎడిషన్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌ 10W మైక్రో-USB ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం మంచి స్పెక్స్ అందించారు. C30 వెనుక భాగంలో f/2.0 ఎపర్చర్‌తో కూడిన 8MP కెమెరాను అందించారు. ఇది 1080P/30fps వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ C30 ఫోన్ కంపెనీ యూనిక్ వర్టికల్ స్ట్రిప్ డిజైన్‌తో వస్తుంది. ఇతర రెడ్‌మీ ఫోన్‌ల మాదిరిగానే C30 కూడా సన్నని 8.5mm మందంతో, 182g బరువుతో నాజూగ్గా కనిపిస్తుంది. ఇది మూడు రంగులలో వస్తుంది. కస్టమర్లు లేక్ బ్లూ, బాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్ కలర్ వేరియంట్లలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

First published:

Tags: Android, Realme, Smart phone, Tech news

ఉత్తమ కథలు