Realme C25Y: తక్కువ ధరకే 50 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ సీ25వై వచ్చేసింది

(image: Realme India)

Realme C25Y | రూ.12,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone) కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈ బడ్జెట్‌లో రియల్‌మీ సీ25వై (Realme C25Y) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ సీ25వై (Realme C25Y) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది కంపెనీ. రియల్‌మీ సీ సిరీస్‌లో (Realme C Series) రిలీజ్ అయిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే రియల్‌మీ సీ సిరీస్‌లో ఇండియాలో రియల్‌మీ సీ21వై, రియల్‌మీ సీ11 2021, రియల్‌మీ సీ25ఎస్, రియల్‌మీ సీ25, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ20, రియల్‌మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ లాంటి మొబైల్స్ ఉన్నాయి. సీ సిరీస్‌లో లో బడ్జెట్ ధరకే స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తోంది రియల్‌మీ. ఇప్పుడు కూడా రూ.10,999 ధరకే రియల్‌మీ సీ25వై స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది.

    ఇండియాలో రూ.10,000 నుంచి రూ.12,000 లోపు బడ్జెట్‌లో సాంసంగ్ ఎం02ఎస్, రెడ్‌మీ 9, ఒప్పో ఏ33, సాంసంగ్ ఎఫ్02ఎస్, పోకో ఎం3, రెడ్‌మీ 8, రియల్‌మీ 25ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లకు రియల్‌మీ సీ25వై గట్టి పోటీ ఇవ్వనుంది. రియల్‌మీ సీ25వై స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, యూనిసోక్ టీ610 ప్రాసెసర్ ఉండటం విశేషం.

    Flipkart: డబ్బులు లేకపోయినా రూ.70,000 వరకు షాపింగ్ చేయొచ్చు... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్


    రియల్‌మీ సీ25వై స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. సెప్టెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటలకు ప్రీ-బుకింగ్ ప్రారంభం అవుతుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999. ఆఫర్ వివరాలను ఇంకా వెల్లడించలేదు రియల్‌మీ. సేల్ సమయానికి బ్యాంక్ ఆఫర్స్‌ని ప్రకటించొచ్చు.

    Realme GT Master Edition: రూ.25,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

    రియల్‌మీ సీ25వై డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఆక్టా కోర్ యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరాలో బ్యూటీ, ఫిల్టర్, హెచ్‌డీఆర్, పనోరమిక్ వ్యూ, పోర్ట్‌రైట్, టైమ్‌ల్యాప్స్, ఎక్స్‌పర్ట్, సూపర్ నైట్ ఫీచర్స్ ఉన్నాయి.

    రియల్‌మీ సీ25వై స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0 వర్షన్, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ సీ25వై స్మార్ట్‌ఫోన్‌ను గ్లేసియర్ బ్లూ, మెటల్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: