Home /News /technology /

Realme C21Y: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్... రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ తెలుసుకోండి

Realme C21Y: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్... రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ తెలుసుకోండి

Realme C21Y: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్... రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ తెలుసుకోండి
(image: Realme India)

Realme C21Y: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్... రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ తెలుసుకోండి (image: Realme India)

Realme C21Y | రియల్‌మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ సీ21వై ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రూ.8,999 బడ్జెట్‌లో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. రియల్‌మీ సీ21వై మోడల్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ సీ సిరీస్‌లో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో మరో మొబైల్ లాంఛ్ చేసింది. రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఆగస్ట్ 30 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

    Locate Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోండి

    WhatsApp: వాట్సప్‌లో ఈ కొత్త ఫీచర్స్ ట్రై చేస్తున్నారా?


    రియల్‌మీ సీ21వై డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్ ఫుల్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. యూనీసోక్ టీ610 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరాలో 4ఎక్స్ జూమ్, PDAF ఆటోఫోకస్, క్రోమాబూస్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటు నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్పర్ట్, టైమ్‌ల్యాప్స్, పోర్ట్‌రైట్ మోడ్, హెచ్‌డీఆర్, అల్‌ట్రా మ్యాక్రో, ఏఐ బ్యూటీ, ఫిల్టర్, క్రోమాబూస్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో పోర్ట్‌రైట్ మోడ్, టైమ్‌ల్యాప్స్, పనోరమిక్ వ్యూ, బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్, ఫేస్ రికగ్నిషన్ ఫీచర్స్ ఉన్నాయి.

    Smartphone: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? 5 బెస్ట్ మోడల్స్ ఇవే

    Wi-Fi Connection: అపరిచితులు మీ వైఫై కనెక్షన్ వాడుతున్నారా? ఇలా చేయండి

    రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో కొనొచ్చు. మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్‌తో 256జీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. దీంతో పాటు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు