హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme C21Y: రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఇవే!

Realme C21Y: రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఇవే!

(image: Realme India)

(image: Realme India)

ప్రస్తుతం రియల్‌మీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ సీ21వై పేరుతో రూపొందించిన డివైజ్‌ను ఆగస్టు 23న విడుదల చేసింది. ఈ ఫోన్ సేల్స్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్నాయి.

ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్‌మీ వరుసగా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ సంస్థ బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మెరుగైన వాటా దక్కించుకుంది. ప్రస్తుతం రియల్‌మీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ సీ21వై పేరుతో రూపొందించిన డివైజ్‌ను ఆగస్టు 23న విడుదల చేసింది. ఈ ఫోన్ సేల్స్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్నాయి.

Realme C21Y స్పెసిఫికేషన్లు:

ఈ ఫోన్ లో 6.5-అంగుళాల హెచ్‌డీ+ (720x1,600పిక్సెల్స్) డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ డిస్‌ప్లేలో 89.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో.. 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఇది వాటర్‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. ఈ ఫోన్ ని 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్ స్ప్రెడ్‌ట్రమ్ యూనిసోక్ (UNISOC) టీ610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీనిలో మాలి G52 అనే పవర్‌ఫుల్ GPUను అందించారు.

సీ21వై స్మార్ట్‌ఫోన్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోపాటు 256GB వరకు మైక్రో SD కార్డ్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని వెనుక భాగంలో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. రియల్‌మీ యుఐ ప్యాకేజీలో భాగమైన ఆండ్రాయిడ్ 11పై ఈ బడ్జెట్ ఫోన్ పనిచేస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను అందించారు. ఇందులో మెయిన్ కెమెరాగా f/2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. మిగిలిన రెండు కెమెరాలు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్.. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్‌ని కలిగి ఉంటాయి. ఇందులో 5 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాను కూడా అందించారు. అలాగే నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, అల్ట్రా మాక్రో, AI బ్యూటీ, బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్, ఫేస్-రికగ్నిషన్ వంటి ఫీచర్లను అందించారు.

5,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ 3GB+32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999 కాగా, 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .9,999గా ఉంది. రియల్‌మీ సీ21వై స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ.కామ్ , ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాంలలో ఆగస్టు 30 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

First published:

Tags: Realme

ఉత్తమ కథలు