Realme C20A: రియల్‌మీ సీ20ఏ లాంఛ్ అయింది... ధర ఎంతో తెలుసా?

Realme C20A: రియల్‌మీ సీ20ఏ లాంఛ్ అయింది... ధర ఎంతో తెలుసా?

Realme C20A: రియల్‌మీ సీ20ఏ లాంఛ్ అయింది... ధర ఎంతో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Realme C20A | రియల్‌మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. రియల్‌మీ సీ20ఏ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
భారత్‌లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ మంచి విక్రయాలు సాధిస్తున్న సంస్థ రియల్ మీ. ఈ ఏడాది ఇప్పటికీ రియల్ మీ C11 మోడల్ ను భారత విపణిలో లాంచ్ చేసింది. తాజాగా మరో సరికొత్త ఫోన్ తో ముందుకు వచ్చింది. అదే రియల్ మీ C20A. అయితే ఈ ఫోన్ ను ముందు బంగ్లాదేశ్ లో విడుదల చేసింది. భారత్ లో ఎప్పుడు వస్తుంది అనే అంశంపై స్పష్టత లేదు. ఇటీవలే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ను కూడా ఆవిష్కరించిందీ కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ 20:9 డిస్ ప్లే కాన్ఫిగరేషన్ తో పాటు మీడియాటెక్ హెలీయో జీ35 SoC తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ముందు, వెనక సింగిల్ కెమెరా సెన్సార్ ఉంది. అంతేకాకుండా డెడికేటేడ్ మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ తో అందుబాటులోకి వచ్చింది. వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఐరన్ గ్రే, లేక్ బ్లూ రంగుల్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు.

రియల్ మీ C20A ధర


బంగ్లాదేశ్ మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభం ధర వచ్చేసి 8,990 టక్కాలు(రూ.7,800). ఇది 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. బంగ్లాదేశ్ లో మాత్రమే లభ్యమవుతున్న ఈ పోన్ మిగిలిన దేశాల్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

Moto G40 Fusion: మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్

Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

రియల్ మీ సీ20ఏ స్పెసిఫికేషన్లు


రెండు సిమ్(నానో) ఆప్షన్ ను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 10 వర్షన్ ను పొందుపరిచారు. అంతేకాకుండా రియల్ మీ యూఐతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 20:9 డిస్ ప్లే కాన్ఫిగరేషన్ ను కలిగి ఉండి 6.5 అంగుళాల(720X1600 పిక్సెల్) HD స్క్రీన్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఆక్టాకోర్ మీడియా టెక్ హెలీయో జీ 35 SoCతో పాటు 2జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం 8 మెగా పిక్సెల్ రియర్ కెమేరాతో ఎఫ్/2.0 లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ను కలిగి ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ తో పాటు ఎఫ్/2.2 లెన్స్ ఫ్లాష్ ను పొందుపరిచారు.

Realme 8 5G: మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తే రూ.549 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్

Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,500 తగ్గింపు

ఈ సరికొత్త రియల్ మీ సీ20ఏ ఫోన్ లో 32జీబీ మెమొరీతో పాటు మైక్రో ఎస్ డీ కార్డు సదుపాయం కూడా ఉంది. 4G LTE, వైఫై 802.11 b/g/n, బ్లూటూత్ వీ5, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లాంటి ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. యాక్సెలోమీటర్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో ఏర్పాటు చేశారు. రివర్స్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే ఈ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 190 గ్రాముల బరువుండి 165.2x76.4x8.9 ఎంఎం ప్రమాణాలతో అందుబాటులోకి వచ్చింది.
Published by:Santhosh Kumar S
First published: