Realme C2 offer: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99 ధరకే రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్

Realme C2 Exchange Offer | ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కాకుండా నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో కొన్నవారికి అదనంగా 5% డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: June 28, 2019, 2:41 PM IST
Realme C2 offer: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99 ధరకే రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్
Realme C2 offer: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99 ధరకే రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్
  • Share this:
ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. రూ.5,999 విలువగల రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.99 ధరకే కొనొచ్చు. ఏకంగా రూ.5,900 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. సేల్ ఇప్పటికే మొదలైంది. రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.99 ధరకే కొనాలంటే మీ దగ్గర పాత ఫోన్ ఉండాలి. మీ పాత ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్‌లో రూ.5,900 వస్తే... మిగతా రూ.99 చెల్లించి రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కాకుండా నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో కొన్నవారికి అదనంగా 5% డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం రియల్‌మీ కంపెనీ ఇండియాలో రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2. డ్యూ డ్రాప్ నాచ్‌తో తక్కువ ధరకే ఈ ఫోన్‌ను రిలీజ్ చేయడం విశేషం. 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌‌ప్లే, ఆక్టాకోర్ హీలియో పీ22, ట్రిపుల్ స్లాట్, స్లో మోషన్ ఫీచర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

రియల్‌మీ సీ2 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.1 అంగుళాల హెచ్‌డీ+
ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ హీలియో పీ22
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9.0+కలర్ ఓఎస్ 6.0
కలర్స్: డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్
ధర:
2జీబీ+16జీబీ- రూ.5,999
3జీబీ+32జీబీ-రూ.7,999

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే


ఇవి కూడా చదవండి:

DeepNude: ఒక్క క్లిక్‌తో అమ్మాయిల్ని నగ్నంగా మార్చే యాప్... కలకలం రేపుతున్న టెక్నాలజీ

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ఈ 5 ఫీచర్లు తెలుసుకోండి

Google Maps: రాంగ్ రూట్‌లో వెళ్తే అలర్ట్ చేసే గూగుల్ మ్యాప్స్
Published by: Santhosh Kumar S
First published: June 28, 2019, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading