రియల్మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఇటీవల రియల్మీ రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,000 ధరకే కొనే అవకాశం లభిస్తే అంతకన్నా ఏం కావాలి. రియల్మీ ఈ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఢిల్లీలో ఎక్స్‌క్లూజీవ్ పాప్ అప్ స్టోర్ ఏర్పాటు చేస్తోంది రియల్మీ. అక్కడ మీ దగ్గరున్న పాత ఫీచర్ ఫోన్ ఇచ్చేసి రూ.2,000 చెల్లిస్తే చాలు రియల్మీ సీ2 సొంతం చేసుకోవచ్చు. #DumpYourFeaturePhone పేరుతో ఈ ఆఫర్ ప్రకటించింది రియల్మీ. మొదటి 50 మందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత వచ్చిన వారికి లక్కీ డ్రా ద్వారా 50 మంది విజేతల్ని ఎంపిక చేస్తుంది. లక్కీ డ్రాలో ఎంపికైన వారికి ఫీచర్ ఫోన్ తీసుకొని రూ.2,000 ధరకే 2జీబీ+16జీబీ వేరియంట్ రియల్మీ సీ2 ఇవ్వనుంది కంపెనీ. రియల్మీ
పాప్ అప్ స్టోర్ ఈవెంట్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ చేసుకున్న రియల్మీ ఫ్యాన్స్‌కు ఆర్-పాస్ షేర్ చేస్తుంది కంపెనీ. ఆర్-పాస్ ఉపయోగించి realme.com/in వెబ్సైట్లో రియల్మీ సీ2 కొనాల్సి ఉంటుంది. రియల్మీ ఎక్స్‌క్లూజీవ్ పాప్ అప్ స్టోర్ మే 18న మధ్యాహ్నం 3 గంటలకు న్యూ ఢిల్లీలోని టాగోర్ గార్డెన్లో గల పసిఫిక్ మాల్లో ఏర్పాటు చేయనుంది రియల్మీ. అయితే ఈ
ఎక్స్ఛేంజ్ ఆఫర్ నియమ నిబంధనలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే
ఇవి కూడా చదవండి:
OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్
SSY Scheme: రోజుకు రూ.100 పొదుపుతో రూ.16 లక్షల రిటర్న్స్...
LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:May 15, 2019, 12:49 pm