HOME »NEWS »TECHNOLOGY »realme c15 qualcomm edition with snapdragon 460 soc debuts in india ns gh

Realme: రియల్ మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. అదిరే ఫీచర్లు.. అందుబాటు ధరలో..

Realme: రియల్ మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. అదిరే ఫీచర్లు.. అందుబాటు ధరలో..
ప్రతీకాత్మక చిత్రం

Realme: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజైంది. జులైలో భారత మార్కెట్లోకి విడుదలైన రియల్ మీ సి15 వేరియంట్ కు కొనసాగింపుగా కొత్త ప్రాసెసర్ తో ఈ నూతన స్మార్ట్ ఫోన్ విడుదలైంది.

  • Share this:
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజైంది. జులైలో భారత మార్కెట్లోకి విడుదలైన రియల్ మీ సి15 వేరియంట్ కు కొనసాగింపుగా కొత్త ప్రాసెసర్ తో ఈ నూతన స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అయితే, అంతకుముందు వేరియంట్లో వీడియో టెక్ హెలియో జీ 35 ప్రాసెసర్ అందించగా.. తాజా వేరియంట్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 SoC ప్రాసెసర్ ను ఉపయోగించారు. అయితే, నూతన క్వాల్కామ్ వేరియంట్లో ఫీచర్ కు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ రియల్మీ సి 15 నూతన క్వాల్కమ్ ఎడిషన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి.

రియల్ మీ సి15 క్వాల్కమ్ ఎడిషన్ ధర


భారతదేశంలో  రియల్‌మీ సి 15 క్వాల్‌కామ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 9,499గా ఉంది. ఇది 3 జీబీ ర్యామ్ సహా 32 జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది. అయితే, రియల్‌మీ సి 15 క్వాల్కామ్ ఎడిషన్ ధర మీడియాటెక్ ఎడిషన్ బేస్ మోడల్ ధర కంటే రూ. 500 ఎక్కవుగా ఉందని చెప్పవచ్చు. ఈ పండుగ సీజన్లో ప్రకటించిన ఆఫర్లలో భాగంగా దీన్ని రూ.  8,999కే పొందొచ్చు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వచ్చే రియల్‌మీ సీ 15 క్వాల్‌కామ్ ఎడిషన్ ధరరూ.10,499గా ఉండగా, మీడియాటెక్ SoC ఎడిషన్ రూ.9,999కే లభిస్తుంది.

అనగా, క్వాల్కామ్ ఎడిషన్ ను కొనాలంటే వీడియోటెక్ ఎడిషన్ కంటే రూ.500 ఎక్కువగా చెల్లించాలి. ఈ రెండు వేరియంట్లు అక్టోబర్ 29 నుండి ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్, అన్ని రియల్మీ రిటైల్ స్టోర్స్ లలో అందుబాటులో ఉంటాయి. రియల్మీ సైట్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఎక్సేంజ్ డీల్స్, ఫ్రీ డెలివరీ, రూ.500 పేటీఎం క్యాష్‌బ్యాక్ తో పాటు ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో 10 శాతం డిస్కౌంట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు 12 నెలల వరకు (నెలకు రూ .875) నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను కూడా ఎంచుకోవచ్చు. రియల్‌మీ సి 15 పవర్ బ్లూ, పవర్ సిల్వర్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

మీ మొబైల్ పోయిందా.. అందులోని మీ డేటాను ఇలా డిలీట్ చేయండి

రియల్ మీ సి15 స్పెసిఫికేషన్స్..
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే క్వాల్కమ్ ఎడిషన్ కూడా మీడియాటెక్ ఎడిషన్ మాదిరిగానే ఉంటుంది. ఇది 20: 9 ఆస్పెక్ట్ రేషియో, 88.7 శాతం స్క్రీన్- టూ -బాడీ రేషియోతో 6.5 -అంగుళాల హెచ్డీ ప్లస్ (720x1,600 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. అంతేకాక డ్యుయల్ సిమ్ సపోర్ట్ తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్ మీ యూఐతో ఇది లభిస్తుంది. ఇది 4GB ర్యామ్, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను కలిగి ఉంది. దీనికి మైక్రో SD కార్డ్ జతచేయడం ద్వారా 256GB వరకు స్టోరేజ్ ను పెంచుకునే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే దీనిలో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి.


13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలతో సూపర్ నైట్‌ స్కేప్, క్రోమా బూస్ట్, స్లో-మో రికార్డింగ్, 1080p వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్లో 4 జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, 3.5 హెడ్ ఫోన్ జాక్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాక దీనిలోని 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వెనుకాల ప్యానెల్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా చేర్చారు.
Published by:Nikhil Kumar S
First published:October 30, 2020, 14:03 pm

टॉप स्टोरीज