రియల్మీ ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇచ్చింది కంపెనీ. ఇప్పటికే రిలీజైన రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ఫీచర్స్‌తో రిలీజ్ చేసింది. కొద్ది రోజుల క్రితం 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. రియల్మీ నుంచి సీ సిరీస్‌లో వస్తున్న మోడల్స్ అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లే. ఇప్పుడు అదే సెగ్మెంట్లో రియల్మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ రిలీజ్ చేసింది కంపెనీ. గతంలో రిలీజైన రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఉన్న సంగతి తెలిసిందే. రియల్మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ కొనేప్పుడు కస్టమర్లు ప్రాసెసర్‌కు ప్రాధాన్యం ఇస్తారు. కొందరు మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న ఫోన్లు కొంటే ఇంకొందరు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌కు ప్రిఫరెన్స్ ఇస్తారు. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కోరుకునే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని రియల్మీ క్వాల్కమ్ ఎడిషన్‌తో రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో రియల్మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ సేల్ కూడా మొదలైంది. 3జీబీ+32జీబీ, 4జీబీ+46జీబీ వేరియంట్లో ఈ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రియల్మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ 3జీబీ+32జీబీ ధర రూ.9,999 కాగా అఫర్ ధర రూ.8,499. ఇక 4జీబీ+46జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.9,499.
PUBG Mobile: పబ్జీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్... ఈరోజు నుంచే గేమ్ పూర్తిగా బంద్
Flipkart Big Diwali sale: రెడ్మీ నుంచి రియల్మీ వరకు... ఈ 12 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
రియల్మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 1,600X720 పిక్సెల్స్
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ +2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: పవర్ బ్లూ, పవర్ సిల్వర్
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,499
4జీబీ+64జీబీ- రూ.9,499
Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... ఫైనల్ రేట్ ఎంతంటే
Oppo A33: భారీ డిస్కౌంట్‌తో ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్ సేల్
బడ్జెట్ సెగ్మెంట్లో రియల్మీ సీ సిరీస్ స్మార్ట్ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉన్నట్టు రియల్మీ ప్రకటించింది. రియల్మీ సీ సిరీస్‌లో ఇటీవల రియల్మీ సీ11, రియల్మీ సీ12, రియల్మీ సీ15 స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రియల్మీ సీ15 క్వాల్కమ్ ఎడిషన్ కూడా వచ్చేసింది. రియల్మీ ఫెస్టీవ్ డేస్ సేల్‌లో రియల్మీ సీ సిరీస్‌లో 10 లక్షల యూనిట్స్ అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది.