హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme C15: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Realme C15: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Realme C15: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
(image: Realme)

Realme C15: 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Realme)

Realme C15 | రియల్‌మీ నుంచి ప్రపంచానికి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ పరిచయమైంది. రియల్‌మీ సీ15 రిలీజైంది. 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ దూకుడుగా కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్‌కు రియల్‌మీ 6ఐ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసిన కంపెనీ... ఇప్పుడు ఇండోనేషియా మార్కెట్‌లో రియల్‌మీ సీ15 మోడల్‌ను రిలీజ్ చేసింది. సీ సిరీస్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లను రియల్‌మీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్‌లో మాత్రమే ఈ ఫోన్ రిలీజైంది. అయితే ఈ ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తుందన్న స్పష్టత లేదు. రియల్‌మీ సీ15 విషయానికి వస్తే 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  Vivo V19: ఈ ఫోన్ ధర రూ.4,000 తగ్గింది... ఇప్పుడు ఎంతంటే

  OnePlus Nord Lite: వన్‌ప్లస్ నార్డ్ లైట్ ఇండియాకు వస్తోందా? ఫీచర్స్ ఏంటంటే

  రియల్‌మీ సీ15 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 1,600X720 పిక్సెల్స్

  ర్యామ్: 3జీబీ, 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35

  రియర్ కెమెరా: 13+8+2+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: బ్లూ, సిల్వర్

  ధర:

  3జీబీ+64జీబీ- సుమారు రూ.10,300

  4జీబీ+64జీబీ- సుమారు రూ.11,300

  4జీబీ+128జీబీ- సుమారు రూ.12,800

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Realme, Realme UI, Smartphone

  ఉత్తమ కథలు