తక్కువ ధరలో బ్యాటరీ ఎక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్మీ నుంచి రెండు స్మార్ట్ఫోన్లు భారీ బ్యాటరీతో రిలీజ్ అయ్యాయి. రియల్మీ సీ15, రియల్మీ సీ12 స్మార్ట్‌ఫోన్స్‌ని ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది కంపెనీ. భారతదేశంలో ఇప్పటికే రియల్మీ సీ సిరీస్‌లో రియల్మీ సీ1, రియల్మీ సీ2, రియల్మీ సీ3, రియల్మీ సీ11 స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అదే సిరీస్‌లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ఫీచర్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ క్వాడ్ కెమెరా, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 18వాట్ క్విక్ ఛార్జర్ లాంటి ప్రత్యేకతలు ఉంటే, రియల్మీ సీ12 స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ట్రిపుల్ కెమెరా, 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఈ రెండు ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 13మెగాపిక్సెల్ కెమెరా, ట్రిపుల్ స్లాట్ లాంటి ఫీచర్స్ కామన్‌గా ఉన్నాయి.
SmartTV: స్మార్ట్ టీవీ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్స్ ట్రై చేయండి
Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజ్ కాగా, రియల్మీ సీ12 మాత్రం 3జీబీ+32జీబీ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్ట్ 27న, రియల్మీ సీ12 సేల్ ఆగస్ట్ 24న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్లో కొనొచ్చు. త్వరలో ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి.
రియల్మీ సీ15 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల మినీడ్రాప్ ఫుల్‌స్క్రీన్
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (18వాట్ క్విక్ ఛార్జ్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+ఎస్డీకార్డు
కలర్స్: పవర్ సిల్వర్, పవర్ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.10,999
రియల్మీ సీ12 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల మినీడ్రాప్ ఫుల్‌స్క్రీన్
ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (18వాట్ క్విక్ ఛార్జ్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+ఎస్డీకార్డు
కలర్స్: పవర్ సిల్వర్, పవర్ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,999