Realme C11 | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్ వచ్చేసింది. రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ధర, స్పెసిఫికేషన్స్ లాంటి వివరాలు తెలుసుకోండి.
తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా? మీ బడ్జెట్ రూ.8,000 లోపేనా? ఇదే బడ్జెట్‌లో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇండియన్ మార్కెట్‌కు రియల్‌మీ సీ11 మోడల్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ సీ సిరీస్ ద్వారా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో రియల్‌మీ సీ11 వచ్చేసింది. 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499 మాత్రమే. జూలై 22 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్లలో సేల్ మొదలవుతుంది. త్వరలో రియల్‌మీ ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
Meet #realmeC11, the upgrade that you need with:
👉5000mAh Battery
👉16.5cm (6.5”) Mini-drop Fullscreen
👉13MP AI Dual Rear Camera with Super Nightscape Mode
👉Geometric Design
రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000 ఎంఏహెచ్ కెపాసిటీతో కొత్త పవర్ బ్యాంకును కూడా రిలీజ్ చేసింది కంపెనీ. ఈ పవర్ బ్యాంక్ ధర రూ.1,999. జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది.