news18-telugu
Updated: November 19, 2020, 3:35 PM IST
Best Wireless Earphones: రూ.5,000 లోపు బెస్ట్ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులోకి వచ్చిన ట్రూలీ వైర్ లెస్ (TWS) ఇయర్ ఫోన్లలో ఏది కొనాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే మీరు బెస్ట్ ఇయర్ ఫోన్స్ పిక్ చేసుకునేందుకు కొన్ని టిప్స్ మేం సజెస్ట్ చేస్తాం. గతంతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ TWSలో చాలా ఇయర్ ఫోన్స్ మార్కెట్‌ను ముంచెత్తుతూనే ఉన్నాయి. రియల్ మీ, షావోమీ వంటి సంస్థలు సరసమైన ధరలకే వీటిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాయి. చవక ధరలకే వస్తున్నాయంటే వీటిలో ఫీచర్లు బాగాలేవనే అంచనాలు, గాలి లెక్కలు వేయకండి. మంచి నాణ్యతతో కూడిన వస్తువులను చవక ధరలో అందుబాటులోకి తేవాలంటే చాలా రీసెర్చ్ అవసరమవుతుంది. అందుకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో శరవేగంగా దూసుకుపోతున్నా ఇలాంటి సంస్థలు ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్ ను మనకు పరిచయం చేస్తున్నాయి. కాబట్టి నిశ్చింతగా వీటిని ట్రై చేయచ్చన్నమాట. వీటికి కూడా వారెంటీలుంటాయి కనుక భయమెందుకు. వేలకు వేలు పెట్టి TWS కొనడం బదులు రూ.5000 లోపు అందుబాటులోకి వచ్చిన బెస్ట్ ఇయర్ పీస్ లు ఏమిటో తెలుసుకుందాం.
Realme Buds Air Pro
ఇ-కామర్స్ సైట్‌లో ప్రస్తుతం రూ.4,999 కే అందుబాటులోకి వచ్చిన రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రోకు అత్యంత చవకైన వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ గా పేరుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ తో ఉన్న ఇవి బాగున్నాయి. 35dB వరకు నాయిస్ రిడక్షన్ ఉంటుందని రియల్ మీ ప్రామిస్ చేస్తోంది. బ్లూ టూత్ 5 కనెక్టివిటీతో , 10mm డైనమిక్ డ్రైవర్స్, 94ms లో లేటెన్సీ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్, IPX4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో ఇది భలే ఆకర్షణీయంగా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే సూపర్ అనుకోండి. ఏకంగా 25 గంటల బ్యాటరీ లైఫ్ తో ఈ ఇయర్ బడ్స్ పనిచేస్తాయని రియల్ మీ చెబుతోంది. ప్రస్తుతానికి కేవలం నలుపు, తెలుపు రంగుల్లో మాత్రమే రియల్ మీ బడ్స్ ఎయిర్ ప్రో లభిస్తున్నాయి.
WhatsApp Feature: మెసేజెస్‌తో వాట్సప్ ఫుల్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి
Poco M3: పోకో ఎం3 వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవే
OnePlus Buds
ఇప్పటికే మీరు వన్ ప్లస్ బడ్స్OnePlus సొంతం చేసుకుంటే మీకో గుడ్ న్యూస్. వన్ ప్లస్ ఫోన్ తో పనిలేకుండా కేవలం అపిషియల్ యాప్ తో నే ఇది బ్రహ్మాండంగా పనిచేసేలా కస్టమైజ్ కంట్రోల్ అనే సరికొత్త ఫీచర్ ను జోడించారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ Flipkart లో లభిస్తున్న వన్ ప్లస్ బడ్స్ ధర రూ.4,990 మాత్రమే కావడం విశేషం.
Oppo Ecno W51
Oppo ఒప్పో Ecno W51 ను మీరు కేవలం రూ. 4,999కే సొంతం చేసుకోవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. కంపెనీ చేస్తున్న ప్రామిస్ ప్రకారం ఈ ఇయర్ ఫోన్ 35dBనాయిస్ ను రెడ్యూస్ చేస్తుంది. 7mm డైనమిక్ డ్రైవర్స్, IP54 రేటెడ్, Qi వైర్లెస్ సపోర్ట్ చేసే చార్జింగ్ ఫీచర్లతో ఇది ఆకట్టుకునేలా ఉంది. వైర్లెస్ చార్జింగ్ మ్యాట్స్ , ప్యాడ్స్ తో ఇది చార్జ్ అవుతుందన్నమాట. ANC ఆన్ చేస్తే ఈ ఇయర్ ఫోన్ 3.5 గంటలు పనిచేస్తుంది. ANC ఆన్ చేయకపోతే 20 గంటలపాటు పనిచేసేలా బ్యాటరీ సామర్థ్యం ఉండడం హైలైట్. దీనికి 3 మైక్రో పోన్ సిస్టంను ఒప్పో యాడ్ చేసింది. దీంతో సౌండ్ క్వాలిటీ చాలా బాగుండి, నాయిస్ తగ్గుతుంది.
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Dual Selfie Camera Phones: సెల్ఫీ కోసం రెండు కెమెరాలు ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
Xiaomi Mi True Wireless Earphones 2
Xiaomi Mi True Wireless Earphones 2 ధర ఏకంగా రూ. 3,999 కే లభిస్తోంది. చూసేందుకు ఇయర్ ప్యాడ్స్ లాంటి ఇయర్ పీస్ లా దీన్ని డిజైన్ అయిన ఈ ఇయర్ పీస్ ఫీచర్స్ బాగున్నాయి. 14.2mmడ్రైవర్స్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, SBC, AAC, LHDC bluetooth codecs సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. కానీ ఇందులో ANC లేకపోవడం మీ చుట్టూ ఉన్న శబ్దాలు వినిపిస్తాయి. 12 గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం షియోమీ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ కు ఉండగా, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.
Noise Shots X5 Pro
ఒక్క సారి చార్జ్ చేసిన నాయిస్ షాట్స్ X5 Pro బ్యాటరీ లైఫ్ 8 గంటలు. కాల్ కామ్ చిప్ సెట్ సపోర్ట్ తో పనిచేసే ఈ ఆడియో ప్రాడక్ట్ నాణ్యతలో అత్యుత్తమంగా ఉంది. ఈ కారణంగా ఇయర్ ఫోన్లో ఏదైనా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. AptX+AAC Hi-Fiఆడియో టెక్నాలజీతో IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో ఇది భలేగా ఉంది. 2,200mAh బ్యాటరీ కేస్ ను కావాలంటే మీ స్మార్ట్ ఫోన్ కు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో రూ.4,499కే అందుబాటులో ఉన్న Noise Shots X5 Pro మంచి రివ్యూలు కూడా ఉన్నాయి.
Published by:
Santhosh Kumar S
First published:
November 19, 2020, 3:35 PM IST