రియల్ మీ (Realme) బ్రాండ్ గురించి టెక్ యూజర్లకు (Tech users) పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్మార్ట్‌ఫోన్లు, ఆడియో డివైజెస్, స్మార్ట్ టీవీలు(Smart TVs), ల్యాప్‌టాప్‌లు.. ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తోంది. అయితే రియల్‌మీ త్వరలో బుక్ ప్రైమ్ (Book Prime) పీసీని ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త వెర్షన్ ల్యాపీని తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఎడిషన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. చైనాలో విడుదలైన రియల్‌మీ బుక్ ఎన్‌హ్యాన్స్‌డ్ (Realme Book Enhanced Edition) వెర్షన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా కొత్త డివైజ్ రానుంది.
రియల్‌మీ బుక్ ప్రైమ్ ల్యాప్ టాప్ (laptop) ఇంటెల్ 11th జనరేషన్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 12 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. రియల్ మీ బుక్ ప్రైమ్ ఇప్పటికే వేరే మార్కెట్లలో అందుబాటులో ఉంది. త్వరలో దీన్ని భారత్‌లో లాంచ్ చేయనున్న నేపథ్యంలో కంపెనీ దీని స్పెసిఫికేషన్లను వెల్లడించింది.
రియల్ మీ బుక్ ప్రైమ్ ధర
రియల్ మీ బుక్ ప్రైమ్ ఎడిషన్ ధర చైనాలో దాదాపు రూ. 55,200 గా ఉంది. (అంటే అక్కడ CNY 4,699). 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్‌కు కంపెనీ ఈ ధరను నిర్దేశించింది. ఇండియాలో ప్రవేశపెట్టే న్యూ మోడల్ ధరను త్వరలో కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
స్పెసిఫికేషన్లు
ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 (windows 11) ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. ఇది 14 అంగుళాల 2K (2,160x1,440 pixels) డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. 11th జనరేషన్ ఇంటెల్ కోర్ సిస్టమ్‌తో ( i5-11320H CPU) పనిచేస్తుంది. ఇక ఇందులో 720p HD వెబ్ క్యామ్ (webcam) ఉంటుంది. అంతే కాకుండా Wi-Fi 6, v5.2 బ్లూ టూత్ (Bluetooth), 3.2 USB, టైప్ (Type)C పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Redmi Note 11T 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపే... ఆఫర్ వివరాలు తెలుసుకోండి
వచ్చే వారంలో కొత్త స్మార్ట్‌ఫోన్స్
మరోవైపు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం సెగ్మెంట్లలో ఎన్నో ఫోన్లను లాంచ్ చేసిన కంపెనీ.. ప్రస్తుతం నార్జో, రియల్‌మీ 9 సిరీస్‌లలో కొత్త మోడళ్లను పరిచయం చేయడంపై దృష్టి సారించింది. Realme 9 Pro 5G, Realme Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌లు రానున్న వారంలో అధికారికంగా విడుదల కానున్నాయి. గత నెలలో కంపెనీ Realme 9i హ్యాండ్‌సెట్‌ను కూడా ఆవిష్కరించింది. Realme 9 5G వేరియంట్‌ను కూడా కంపెనీ త్వరలో లాంచ్ చేయనుందని నివేదికలు వెల్లడించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.