హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo: రియల్‌మీ మరో సంచలనం... నార్జో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్స్

Realme Narzo: రియల్‌మీ మరో సంచలనం... నార్జో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్స్

Realme Narzo: రియల్‌మీ మరో సంచలనం... నార్జో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్స్
(image: Realme India)

Realme Narzo: రియల్‌మీ మరో సంచలనం... నార్జో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్స్ (image: Realme India)

Realme Narzo series smartphones | రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ నుంచి నార్జో సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయి.

  ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రియల్‌మీ... మరో సంచలనానికి తెరతీసింది. ఒప్పో సబ్‌బ్రాండ్‌గా ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన రియల్‌మీ ఆ తర్వాత సొంత బ్రాండ్‌గా మారిన సంగతి తెలిసింది. ఇప్పటికే రియల్‌మీ నుంచి అనేక ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇటీవలే రియల్‌మీ 6 సిరీస్‌లో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో రిలీజ్ అయ్యాయి. ఇంతలోనే రియల్‌మీ మరిన్ని కొత్త ఫోన్స్‌ని ప్రకటించింది. 'నార్జో' సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తోంది. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మోడల్స్‌ని మార్చి 26న మధ్యాహ్నం 12.30 గంటలకు రిలీజ్ చేయనుంది. రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్‌ను ఆన్‌లైన్‌లో చేయనుంది కంపెనీ. కరోనా వైరస్ ప్రభావంతో ఆన్‌గ్రౌండ్ ఈవెంట్లను నిర్వహించట్లేదు మొబైల్ కంపెనీలు.

  ఇప్పటికే రియల్‌మీ నుంచి ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు వాటితో పాటు రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కూడా రానున్నాయి. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతానికి నార్జో సిరీస్‌లో రెండు ఫోన్లు రానున్నాయి. అయితే వీటి స్పెసిఫికే,న్స్ ఎలా ఉంటాయన్నది ఇంకా అధికారికంగా తెలియదు. రియల్‌మీ నార్జో 10 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ70, నార్జో 10ఏలో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్స్ ఉంటాయన్న లీక్స్ వస్తున్నాయి. ఈ ఫోన్ల ధర కూడా రూ.10,000 ఉండొచ్చని భావిస్తున్నారు.

  ఇవి కూడా చదవండి:

  IRCTC: మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా? ఈ వార్నింగ్ మీకోసమే

  4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

  Flipkart Big Shopping Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు