స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కొత్తకొత్త ఫోన్లు వరుసగా వచ్చేస్తున్నాయి. ఆగస్ట్‌లోనే ఐదారు 10 కొత్త మోడల్స్ రిలీజ్ అయ్యాయి. త్వరలో మరిన్ని కొత్త ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. త్వరలో 64 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేస్తామని రియల్మీ కొంతకాలంగా చెబుతోంది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించేసింది. త్వరలో రియల్మీ ఎక్స్‌టీ మోడల్ రిలీజ్ చేయబోతున్నామని, అందులో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు... ఇండియాలో తొలిసారి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రిలీజ్ చేయబోతోంది రియల్మీ. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫోటోస్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ కన్నా ముందే ఈ ఫోన్ రిలీజ్ కానుంది. రియల్మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు సెప్టెంబర్‌లో తెలిసే అవకాశముంది.
Our users are no.1 priority for us! And realme users have become the world's first to have a hands-on experience of the #64MP Quad Camera on a smartphone with #realmeXT. Here's a glimpse of the exclusive #realmeInsider event. #DareToLeap pic.twitter.com/jDwzg7dqoh
— Madhav '5'Quad (@MadhavSheth1) August 28, 2019
రియల్మీ ఎక్స్ సిరీస్‌లో వస్తున్న రెండో స్మార్ట్‌ఫోన్ రియల్మీ ఎక్స్‌టీ. 64 మెగాపిక్సెల్ కెమెరాకు సాంసంగ్ కొత్తగా రిలీజ్ చేసిన ISOCELL Bright GW1 సెన్సార్ ఉపయోగిస్తోంది రియల్మీ. ఇప్పటికే నాలుగు కెమెరాలతో రియల్మీ 5 సిరీస్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. రియల్మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా నాలుగు కెమెరాలు ఉండబోతున్నాయి. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉండబోతోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ VOOC 3.0 ఫ్లాష్ ఛార్జ్. సూపర్ అమొలెడ్ డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, 92.1 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.
Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Smartphone: ఎంఐ ఏ3, రియల్మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్... ఈ మూడు ఫోన్లల్లో ఏది బెటర్?
New Smartphone: 4 రోజుల్లో 4 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... వీటిలో ఏది బెటర్?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Realme, Smartphone