HOME »NEWS »TECHNOLOGY »realme announced realme x7 pro realme x7 5g smartphone official launch date in india ns gh

Realme 5G Smartphones: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ రెండు 5జీ ఫోన్ల విడుదల తేదీని ప్రకటించిన రియల్‌మీ

Realme 5G Smartphones: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ రెండు 5జీ ఫోన్ల విడుదల తేదీని ప్రకటించిన రియల్‌మీ
ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ.. స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. రియల్ మీ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలకు తేదీ ఖరారైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ.. స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. రియల్మీ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలకు తేదీ ఖరారైంది. రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ ఎక్స్ 7 ప్రో పేరిట విడుదలయ్యే ఈ రెండు 5జీ స్మార్ట్ ఫోన్ల్లో ఫిబ్రవరి 4న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. “ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు 5 జీ స్మార్ట్ ఫోన్ల అనుభవాన్ని అందించేందుకు రియల్ మీ సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న భారత్లో ఈ స్మార్ట్ ఫోన్లు లాంఛ్ కానున్నాయి. " అని వెల్లడించారు. కాగా, గత సెప్టెంబర్ నెలలోనే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు చైనాలో విడుదలైన విషయం తెలిసిందే.

రియల్‌మీ ఎక్స్ 7 స్పెసిఫికేషన్లు


రియల్ఈ ఎక్స్ 7 స్మార్ట్ ఫోన్ 5జీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ హెడ్డి ప్లస్ అమొలెడ్ పంచ్ హోల్డ్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 800U SoC ప్రాసెసర్త్ తో పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరాలు 64 ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలతో పాటు ముందు భాగంలో 32 ఎంపీ కెమెరాను పొందుపర్చారు. దీనిలో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే 4,300 mAh బ్యాటరీని అమర్చారు. ఆండ్రాయిడ్ 10 యుఐ ఆధారంగా రియల్ మీ ఎక్స్ 7 పనిచేస్తుంది.

రియల్‌మీ ఎక్స్ 7 ప్రో స్పెసిఫికేషన్లు
రియల్ఈ ఎక్స్7 స్మార్ట్ఫోన్ కూడా 5 జీ సపోర్ట్ తో వస్తుంది. ఇది 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే పంచ్ హోల్ తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాక, ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 1000+ SoC చిప్సెట్ తో పనిచేస్తుంది. దీనిలో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ను అందించారు. రియల్మీ ఎక్స్ 7 లాగానే దీని వెనుక భాగంలో కూడా నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో 64 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా వంటివి ఉంటాయి. దీని ముందు వైపు 32 ఎంపీ కెమెరాను పొందుపర్చారు. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రియల్మీ ఎక్స్7 ప్రో పనిచేస్తుంది. అయితే, ఈ రెండు స్మార్ట్ ఫోన్ ధరను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు రియల్ మీ సంస్థ.
Published by:Nikhil Kumar S
First published:January 27, 2021, 17:52 IST