Realme X2 Pro: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ ఎక్స్2 ప్రో రిలీజ్... ప్రత్యేకతలివే

Realme X2 Pro | రియల్‌మీ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ కెమెరా, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, 50W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: November 21, 2019, 10:10 AM IST
Realme X2 Pro: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ ఎక్స్2 ప్రో రిలీజ్... ప్రత్యేకతలివే
Realme X2 Pro: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ ఎక్స్2 ప్రో రిలీజ్... ప్రత్యేకతలివే
  • Share this:
రియల్‌మీ నుంచి 64 మెగాపిక్సెల్ కెమెరాతో మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ ఎక్స్2 ప్రో చైనాలో అధికారికంగా రిలీజైంది. రియల్‌మీ ఎక్స్ సిరీస్‌లో భాగంగా రిలీజైన ఫోన్ ఇది. ఇప్పటికే రియల్‌మీ ఎక్స్, రియల్‌మీ ఎక్స్‌టీ మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు రియల్‌మీ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ ఫోన్ డిసెంబర్‌లో ఇండియాకు రానుంది. మూడు వేరియంట్లలో రియల్‌మీ ఎక్స్2 ప్రో మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. హైఎండ్ వేరియంట్ ఏకంగా 12 జీబీ ర్యామ్‌తో ఉండటం విశేషం. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ కెమెరా, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, 50W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. భారీ ఫీచర్లు ఉండటంతో ధర కూడా భారీగానే ఉంది. ప్రారంభ ధర సుమారు రూ.25,990. చైనాలో ప్రీ-బుకింగ్ అక్టోబర్ 18న ప్రారంభం కానుంది.

రియల్‌మీ ఎక్స్2 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+
ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855+
రియర్ కెమెరా: 64+13+8+మ్యాక్రో లెన్స్ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
కలర్స్:
ధర:
6జీబీ+64జీబీ- సుమారు రూ.25,990
8జీబీ+128జీబీ- సుమారు రూ.27,990
12జీబీ+256జీబీ- సుమారు రూ.31,990

Abdul Kalam Birth Anniversary: మీలో స్ఫూర్తిని రగిలించే అబ్దుల్ కలాం సూక్తులు



ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.15,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇవే బెస్ట్ మోడల్స్

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

Card Lost: మీ క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు పోయిందా? ఇలా చేయండి
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading