Realme X2 Pro: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రియల్‌మీ ఎక్స్2 ప్రో వచ్చేస్తోంది

Realme X2 Pro India Release | సాంసంగ్, షావోమీ, ఒప్పో లాంటి బ్రాండ్స్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది రియల్‌మీ ఎక్స్2 ప్రో. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందన్న స్పష్టత లేదు.

news18-telugu
Updated: November 21, 2019, 10:10 AM IST
Realme X2 Pro: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రియల్‌మీ ఎక్స్2 ప్రో వచ్చేస్తోంది
Realme X2 Pro: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రియల్‌మీ ఎక్స్2 ప్రో వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్‌మీ ఎక్స్2 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది. నవంబర్ 20న రియల్‌మీ ఎక్స్2 ప్రో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది కంపెనీ. నవంబర్ 20న మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూ ఢిల్లీలో రియల్‌మీ ఎక్స్2 ప్రో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో రిలీజ్ కావడంతో ఫీచర్లు అందరికీ తెలిసినవే. సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ కెమెరా, 50w SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రియల్‌మీ నుంచి రాబోతున్న మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న సాంసంగ్, షావోమీ, ఒప్పో లాంటి బ్రాండ్స్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది రియల్‌మీ ఎక్స్2 ప్రో. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందన్న స్పష్టత లేదు.





రియల్‌మీ ఎక్స్2 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+
Loading...
ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855+
రియర్ కెమెరా: 64+13+8+మ్యాక్రో లెన్స్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
కలర్స్:
ధర:
6జీబీ+64జీబీ- సుమారు రూ.25,990
8జీబీ+128జీబీ- సుమారు రూ.27,990
12జీబీ+256జీబీ- సుమారు రూ.31,990

Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్... సెట్టింగ్స్ ఇవే

Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ధర ఎంతో తెలుసా?

WhatsApp: వాట్సప్‌కు షాక్... ఇండియాలో 80 శాతం పడిపోయిన డౌన్‌లోడ్స్... ఎందుకో తెలుసా?
First published: November 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...