మీరు రూ.15,000 లోపు బడ్జెట్లో (Smartphone Under Rs 15000) స్మార్ట్ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? రియల్మీ 9 సిరీస్లో తొలి స్మార్ట్ఫోన్ రియల్మీ 9ఐ (Realme 9i) ఇటీవల రిలీజ్ అయింది. జనవరి 22న సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్మీ 8ఐ అప్గ్రేడ్ వేరియంట్ ఇది. రూ.15,000 లోపు బడ్జెట్లో రియల్మీ 8ఐ (Realme 8i) పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియల్మీ 9ఐ వచ్చేసింది. రియల్మీ 8ఐ కన్నా రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లో ఎక్కువగా ఉన్న ఫీచర్స్ ఏంటీ? ఈ స్మార్ట్ఫోన్ను రియల్మీ ఎలా అప్గ్రేడ్ చేసింది? ఇప్పుడు రియల్మీ 8ఐ కొనడం బెటరా? లేక రియల్మీ 9ఐ తీసుకోవచ్చా? ఈ రెండు స్మార్ట్ఫోన్ల మధ్య తేడాలేంటీ? ఒకేలా ఉన్న ఫీచర్స్ ఏంటీ? తెలుసుకోండి.
రియల్మీ 9ఐ, రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్ల ధరలు ఒకేలా ఉండటం విశేషం. మరి రియల్మీ 9ఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత రియల్మీ 8ఐ ధర తగ్గుతుందేమో చూడాలి. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ రెండు స్మార్ట్ఫోన్ల మధ్య పెద్దగా తేడాలు ఏమీ కనిపించట్లేదు. ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్, బ్యాటరీ, కెమెరా ఫీచర్స్ అన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి. రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ ఉంటే రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లో సరికొత్త క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్.
ఇక డిస్ప్లే సైజ్ ఒకేలా ఉన్నా రియల్మీ 8ఐ స్మార్ట్ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే రియల్మీ 9ఐ మొబైల్లో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. లేటెస్ట్ మోడల్లో రిఫ్రెష్ రేట్ తగ్గింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే రియల్మీ 8ఐ మోడల్లో 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.