Home /News /technology /

REALME 9I SMARTPHONE LAUNCHED IN INDIA WITH QUALCOMM SNAPDRAGON 680 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Realme 9i: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ 9ఐ రిలీజ్... ధర ఎంతంటే

Realme 9i: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ 9ఐ రిలీజ్... ధర ఎంతంటే
(image: Realme India)

Realme 9i: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ 9ఐ రిలీజ్... ధర ఎంతంటే (image: Realme India)

Realme 9i Sale | రియల్‌మీ 9ఐ (Realme 9i) స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేసింది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 15000) ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది రియల్‌మీ ఇండియా. ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    రియల్‌మీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రియల్‌మీ 9ఐ (Realme 9i) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. భారతదేశంలో రియల్‌మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) రిలీజ్ అయిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. రియల్‌మీ 9ఐ గతంలో వియత్నాం మార్కెట్‌లో రిలీజ్ అయింది. కాబట్టి స్పెసిఫికేషన్స్ దాదాపుగా తెలిసినవే. అయితే ధర ఎంత ఉంటుందన్న ఆసక్తి రియల్‌మీ ఫ్యాన్స్‌లో కనిపించింది. రూ.15,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది రియల్‌మీ ఇండియా. రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999.

    రియల్‌మీ 9ఐ సేల్ ఎప్పుడు?


    రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ ఎర్లీ సేల్ జనవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలి సేల్ జనవరి 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను ధర రూ.13,249 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,249 ధరకు సొంతం చేసుకోవచ్చు. ప్రిస్మ్ బ్లూ, ప్రిస్మ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

    Samsung Galaxy M52: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.8,000 డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్


    రియల్‌మీ 9ఐ స్పెసిఫికేషన్స్


    రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో ఇప్పటికే వివో వై33టీ, వివో వై21ఇ, వివో వై21టీ, ఒప్పో ఏ36 లాంటి మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటికి రియల్‌మీ 9ఐ పోటీ ఇవ్వనుంది. రియల్‌మీ 9ఐ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

    iQOO Discount Offer: అమెజాన్‌లో ఐకూ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్

    రియల్‌మీ 9ఐ కెమెరా ఫీచర్స్


    రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లతో ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 50 మెగాపిక్సెల్ మోడ్, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్‌పర్ట్, టైమ్ ల్యాప్స్, పోర్ట్‌రైట్ మోడ్, స్లో మోషన్, సూపర్ టెక్స్ట్‌, అల్‌ట్రా మ్యాక్రో లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    ఇక రియల్‌మీ 9ఐలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, టైమ్ ల్యాప్స్, పోర్ట్‌రైట్ మోడ్, ఏఐ బ్యూటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile News, Mobiles, Realme, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు