Home /News /technology /

REALME 9I INDIA LAUNCH SPECIFICATIONS TEASER MADHAV SHETH GH VB

Realme 9i: ఆన్​లైన్​లో లీకైన రియల్​మీ 9ఐ స్మార్ట్​ఫోన్ ఫీచర్స్.. దీంతో పాటు రూ.1099 విలువ చేసే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

త్వరలోనే రియల్​మీ 9 సిరీస్​ నుంచి రియల్​మీ 9ఐ (Realme 9i) స్మార్ట్​ఫోన్​ను లాంచ్​​ చేయనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్, రియల్​మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ స్మార్ట్‌ఫోన్‌ను టీజర్​ను కూడా విడుదల​ చేశారు.

ఇంకా చదవండి ...
నూతన సంవత్సరంలో(New Year) స్మార్ట్ బ్రాండ్లు వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్​ఫోన్(SmartPhone)​ తయారీ సంస్థ రియల్​మీ (Realme) మరో స్మార్ట్​ఫోన్​ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే రియల్​మీ 9 సిరీస్​ నుంచి రియల్​మీ 9ఐ (Realme 9i) స్మార్ట్​ఫోన్​ను లాంచ్(Launch)​​ చేయనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్(Vice President), రియల్​మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మాధవ్ షేత్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ స్మార్ట్‌ఫోన్‌ను టీజర్​ను కూడా విడుదల​ చేశారు. అయితే ఈ టీజర్​లో ధర, స్పెసిఫికేషన్​ వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ ఈ స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన ఫీచర్లు ఆన్​లైన్​లో(Online) లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ రియల్​మీ 9ఐ ఫీచర్లను వెల్లడించారు.

ఇది కూడా చదవండి : బంగ్లా ఫీల్డర్లు అంతే.. బంగ్లా ఫీల్డర్లు అంతే.. ఒక బంతికి 7 పరుగులు సమర్పయామి..

ఈ స్మార్ట్​ఫోన్​ జనవరి 10 న వియత్నాం మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఇప్పటికే మలేషియా మార్కెట్​లో SIRIM సర్టిఫికేషన్​ కూడా పొందింది. అంటే, త్వరలోనే భారత మార్కెట్​లోకి విడుదల కానుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. టిప్​స్టర్​ శుధాన్షు అంబోర్​ చేసిన ట్వీట్​లో రియల్‌మీ ఇండియా స్క్రీన్‌షాట్‌లను బహిర్గతం చేశారు. దీనితో పాటు రియల్‌మీ 9ఐ మోనికర్, ఇతర రియల్‌మీ హ్యాండ్‌సెట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంబోర్ తన ట్వీట్‌లో రియల్‌మీ 9ఐ పవర్ అడాప్టర్ ధర రూ. 1,099, కేబుల్ ధర రూ. 399గా పేర్కొన్నాడు. ఇక, రియల్​మీ 9ఐతో పాటు రియల్​మీ నార్జో 50 మలేషియా SIRIM సర్టిఫికేషన్​ను పొందాయని ఆంబోర్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​తో వస్తుందని టిప్​స్టార్​ పేర్కొన్నారు.

Realme GT Neo 2: త్వరలోనే రియల్​మీ జీటీ నియో 2 డ్రాగన్ బాల్ జెడ్​ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే.. .


రియల్​మీ 9i స్పెసిఫికేషన్లు (అంచనా)..
ఆన్​లైన్​లో లీకైన ఫీచర్లను బట్టి చూస్తే.. రియల్​మీ 9i స్మార్ట్​ఫోన్​ 6.59 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ (2,400x1,080 పిక్సెల్‌లు) LCD ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మూడు వైపులా సన్నని బెజెల్స్‌తో పాటు సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 680 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ను కలిగి ఉంటుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. రియల్​మీ 9i ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​తో వస్తుంది. దీనిలో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనుంది. మరోవైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం దీనిలో 16 -మెగాపిక్సెల్ షూటర్‌ కెమరాను కూడా చేర్చనుంది. దీనిలోని 5,000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: Realme

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు