రియల్మీ ఇండియా ఇటీవల భారతదేశంలో లాంఛ్ చేసిన రియల్మీ 9ఐ 5జీ (Realme 9i 5G) స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రియల్మీ 9 సిరీస్‌లో రిలీజ్ అయిన మొబైల్ ఇది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రియల్మీ 9, రియల్మీ 9 5జీ, రియల్మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, రియల్మీ 9 ప్రో (Realme 9 Pro), రియల్మీ 9 ప్రో+, రియల్మీ 9ఐ మోడల్స్ ఉన్నాయి. లేటెస్ట్గా రియల్మీ 9ఐ 5జీ వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 90Hz డిస్ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్లో రియల్మీ 9ఐ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది.
రియల్మీ 9ఐ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్ట్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.13,999 ధరకే కొనొచ్చు.
Samsung: సాంసంగ్ ఆఫర్... మొబైల్, టీవీ కొనేందుకు రూ.60,000 వరకు క్రెడిట్
The #realme9i5G is here!
Powered by a Dimensity 810 5G Chipset and finessed with the remarkable Laser Light Design, #The5GRockstar is all you need to light up your world.
First Sale today at 12 PM
Know more: https://t.co/T245c65Qld pic.twitter.com/Udq6Ocxap9
— realme (@realmeIndia) August 24, 2022
రియల్మీ 9ఐ 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ నార్జో 50, వివో వీ23ఇ, రియల్మీ 9 5జీ, రియల్మీ 8ఎస్ మోడల్స్‌లో ఉంది. రియల్మీ 9ఐ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
రియల్మీ 9ఐ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ప్రో మోడ్, టైమ్‌లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, హెచ్‌డిఆర్, అల్ట్రా మాక్రో, AI సీన్ రికగ్నిషన్, AI బ్యూటీ, ఫిల్టర్, క్రోమా బూస్ట్, స్లో మోషన్, స్ట్రీట్ మోడ్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రియల్మీ 9ఐ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రెయిట్ మోడ్, టైమ్‌లాప్స్, పనోరమిక్ వ్యూ, బ్యూటీ మోడ్, HDR, ఫేస్-రికగ్నిషన్, ఫిల్టర్, నైట్ మోడ్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
రియల్మీ 9ఐ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్ సెటప్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, 5జీ, వైఫై, బ్లూటూత్ 5.2 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మెటాల్లికా గోల్డ్, రాకింగ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Realme, Smartphone