అదిరిపోయే ఫీచర్లతో అతి తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్మీ. భారత్‌లో ఈ బ్రాండ్ ఫోన్లకు కోట్లాది మంది లవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే గత రెండు నెలలుగా ఇండియాలో ఎలాంటి మొబైల్ ఫోన్ లాంచ్ చేయని రియల్మీ అతి త్వరలోనే రియల్మీ 9 సిరీస్‌ను (Realme 9 Series) రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన లీక్ వెలుగు చూసింది. ఈ ఫ్రెష్ లీక్ ప్రకారం, గ్లోబల్ వెర్షన్ అయిన రియల్మీ 9ఐ (Realme 9i) భారత్‌లో రియల్మీ నార్జో 9ఐ (Realme Narzo 9i)గా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రియల్మీ 9 ప్రో+ ఫీచర్స్ లీక్స్ అయ్యాయి. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
రియల్మీ 9 సిరీస్‌లో రియల్మీ 9, రియల్మీ 9ఐ, రియల్మీ 9 ప్రో+/మ్యాక్స్ ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో రియల్మీ 9ఐ రీబ్రాండ్ వెర్షన్ గా వచ్చే రియల్మీ నార్జో 9ఐ స్పెసిఫికేషన్లకు సంబంధించి ర్యామ్, స్టోరేజ్, కలర్ ఆప్షన్ వంటి వివరాలు లీక్ అయ్యాయి. రియల్మీ 9 సిరీస్‌లోని ప్రో వెర్షన్ కూడా త్వరలో విడుదల కానుందని సమాచారం.
రియల్మీ 9 ప్రో+ థాయిలాండ్‌కు చెందిన నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్, టెలికమ్యూనికేషన్స్ కమీషన్ (NBTC) సర్టిఫికేషన్ వెబ్సైట్లో మొదటిగా కనిపించింది. ఆ తర్వాత టీకేడీఎన్, యురేషియన్ ఎకనామిక్ కమీషన్ (EEC) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లోని లిస్టులతో సహా ఇతర వెబ్సైట్లలో కూడా రియల్మీ 9 ప్రో+ కనిపించింది. దాంతో ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రావచ్చునని తెలుస్తోంది.
రియల్మీ నార్జో 9ఐ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్లు
ఓ ప్రముఖ టిప్‌స్టర్ ప్రకారం రియల్మీ నార్జో 9ఐ వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోగా భారతదేశంలో రిలీజ్ కానుంది. రియల్మీ 9ఐ ఫోన్‌ను రీబ్రాండింగ్ చేసి రియల్మీ నార్జో 9ఐగా ఇండియాలో రిలీజ్ చేస్తున్నారని టిప్స్టర్లు పేర్కొంటున్నారు. లీకుల ప్రకారం, రియల్మీ నార్జో 9ఐ ప్రిజం బ్లూ, ప్రిజం బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది 4జీబీ + 6జీబీ ర్యామ్.. 64జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుందని సమాచారం.
లీకుల ప్రకారం, రియల్మీ నార్జో 9ఐ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇది వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో సహా 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
రియల్మీ 9 ప్రో+ లీక్స్
రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ, 4జీ వేరియంట్లు నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్, టెలికమ్యూనికేషన్స్ కమీషన్ (NBTC) సర్టిఫికేషన్ సైట్లో కనిపించిందని ఓ లీక్ స్టార్ ట్వీట్ చేశారు. మోడల్ నంబర్ RMX3393తో రియల్మీ 9 ప్రో+ ఫోన్ కెమెరా FV5 డేటాబేస్‌లో కనిపించిందని నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, రియల్మీ 9 ప్రో+ 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు, f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ లకు సంబంధించిన విడుదల తేదీలను రియల్మీ సంస్థ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.