హోమ్ /వార్తలు /technology /

Smartphones: రూ.20,000 లోపు హైక్వాలిటీ కెమెరా స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా? ఈ టాప్ 5​ మోడళ్లను పరిశీలించండి

Smartphones: రూ.20,000 లోపు హైక్వాలిటీ కెమెరా స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా? ఈ టాప్ 5​ మోడళ్లను పరిశీలించండి

Smartphones | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి కెమెరా ఉన్న మొబైల్ (Best Camera Mobile) కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో ఉన్న బెస్ట్ మోడల్స్ ఇవే.

Smartphones | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి కెమెరా ఉన్న మొబైల్ (Best Camera Mobile) కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో ఉన్న బెస్ట్ మోడల్స్ ఇవే.

Smartphones | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి కెమెరా ఉన్న మొబైల్ (Best Camera Mobile) కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో ఉన్న బెస్ట్ మోడల్స్ ఇవే.

    భారత మార్కెట్​లో బడ్జెట్​, మిడ్​రేంజ్​ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే, మొబైల్ తయారీ సంస్థలు రూ. 20 వేలలోపు మిడ్​రేంజ్​ ఫోన్లను (Smartphone Under Rs 20000) లాంచ్​ చేస్తున్నాయి. బడ్జెట్​ ధరలోనే వీటిలో ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. సాధారణంగా ఫ్లాగ్​షిప్​ ఫోన్లలో లభించే 8K వీడియో రికార్డింగ్​, హై క్వాలిటీ కెమెరాలు, అట్రాక్టివ్​ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ వంటి అద్భుతమైన ఫీచర్లను వీటిలోనూ అందిస్తున్నాయి. మీరు రూ. 20 వేల ధరలోపు హై క్వాలిటీ కెమెరా గల​ మిడ్​రేంజ్​ ఫోన్​ కోసం చూస్తున్నట్లైతే.. ఈ టాప్​ 5 ఫోన్లను పరిశీలించండి.

    రియల్​మీ 9 ప్రో

    రూ. 20 వేలలోపు బెస్ట్ మిడ్​రేంజ్​ ఫోన్​ కోసం చూస్తున్నట్లైతే.. రియల్​మీ 9 ప్రో బెస్ట్ ఆప్షన్​. దీని 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ రూ. 17,999 ధర వద్ద లభిస్తుంది. రియల్​మీ 9 ప్రో ఫోన్లలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో జత చేయబడిన 64 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. దీని ముందు భాగంలో,16- మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరాను చేర్చింది. అది అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. ఈ స్మార్ట్​ఫోన్​ 33W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది.

    Rent AC Online: సమ్మర్ కోసం ఏసీ కొంటారా? ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకోండిలా

    వివో టీ1

    వివో ఇటీవల భారత మార్కెట్​లోకి కొత్త టీ -సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని మొదటి స్మార్ట్​ఫోన్ ఇదే కావడం విశేషం. వివో టీ1 4జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ రూ. 15,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు 2- మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. హోల్-పంచ్ కటౌట్ లోపల ఉన్న సెల్ఫీ కెమెరా చాలా ప్రముఖమైనది.

    మోటరోలా మోటో G71

    మోటో G71 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ రూ. 18,999 ధర వద్ద లభిస్తుంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో 50- మెగాపిక్సెల్, 8 -మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 2 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలను చేర్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్​ UI ఓఎస్​పై పనిచేస్తుంది. ఇది 6.4 -అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇదీ మీకు మెరుగైన వీక్షణ అనుభవాన్ని ఇస్తుంది.

    iPhone: ఫ్లిప్‌కార్ట్‌లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్ రూ.10,000 లోపే... త్వరపడండి

    రెడ్​మీ నోట్ 11T 5G

    షియోమి రెడ్​మీ నోట్ 11T 5G స్మార్ట్​ఫోన్​ 6 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ రూ. 16,999 ధర వద్ద లభిస్తుంది. దీని వెనుకవైపు కేవలం రెండు కెమెరాలను అందించింది. ఇక, ముందువైపు 16- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనిలో 5,000mAh బ్యాటరీని చేర్చింది. ఇది ఒక రోజంతా బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. 6.6 -అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్​ డిస్‌ప్లే కంటెంట్‌ను వీక్షించడానికి అనువుగా ఉంటుంది.

    వివో V20 SE

    వివో V20 SE రెండు సంవత్సరాల క్రితం లాంచ్​ అయ్యింది. దీని 8జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ రూ. 19,500 వద్ద లభిస్తుంది. కంపెనీ V సిరీస్ ఫోన్లు బెస్ట్ ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి చెందాయి. ఈ ఫోన్​లో 48 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 -మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 2 -మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను చేర్చింది. దీని ముందు భాగంలో, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32 -మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరాను అందించింది. ఇది ఆండ్రాయిడ్​ 10 ఓఎస్​పై రన్​ అవుతుంది.

    First published:

    ఉత్తమ కథలు