రియల్‌మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) ఇండియాలో రియల్‌మీ 9 స్పీడ్ ఎడిషన్ (Realme 9 SE), రియల్‌మీ 9 (Realme 9) మోడల్స్ లాంఛ్ అయ్యాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో రియల్‌మీ 9 ప్రో, రియల్‌మీ 9 ప్రో+, రియల్‌మీ 9ఐ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు మోడల్స్‌ని పరిచయం చేసింది. వీటిలో తొలిసారిగా ఎస్ఈ సిరీస్‌లో రియల్‌మీ 9 ఎస్ఈ మోడల్ పరిచయం చేయడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ విశేషాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే... ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 144Hz డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 బడ్జెట్‌లో మోడల్ రిలీజైంది.
రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499. మార్చి 14 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనొచ్చు.
Introducing #realme9 5G with ?Dimensity 810 5G Processor ?90Hz Ultra Smooth Display & more.
Available in ?4GB+64GB, ₹14,999 Introductory Price Offer ?6GB+128GB, ₹17,499 1st Sale at 12 PM, 14th Mar on https://t.co/HrgDJTI9vv & @Flipkart.#realme9series 5G #SpeedOfLight pic.twitter.com/x2SiZn5agd — realme (@realmeIndia) March 10, 2022
రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ నోట్ 11టీ, వివో వీ23ఈ 5జీ, లావా అగ్ని 5జీ, రియల్‌మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
Poco M4 Pro 4G: పోకో ఎం4 ప్రో 4జీ సేల్ మొదలైంది... నెలకు రూ.572 చెల్లిస్తే చాలు
రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. స్టార్‌గేజ్ వైట్, మెటియార్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.