రియల్‌మీ ఇండియా భారతదేశంలో దూకుడుగా కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్‌మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) మరో రెండు స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రియల్‌మీ 9 ప్రో, రియల్‌మీ 9 ప్రో+, రియల్‌మీ 9ఐ మోడల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియల్‌మీ 9 స్పీడ్ ఎడిషన్ (Realme 9 SE), రియల్‌మీ 9 (Realme 9) మోడల్స్ తీసుకొచ్చింది. వీటిలో రియల్‌మీ 9 ఎస్ఈ ప్రత్యేకతలు చూస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉండటం విశేషం. దీంతో పాటు 144Hz డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ 9 ఎస్ఈ మోడల్ రిలీజైంది.
రియల్‌మీ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. మార్చి 14 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనొచ్చు.
Introducing #realme9SE 5G with: ?Snapdragon 778G 5G Processor ?144Hz Adaptive Refresh Rate Display & more!
Available in: ?6GB+128GB, ₹19,999 ?8GB+128GB, ₹22,999 1st sale at 12 PM, 14th March on https://t.co/HrgDJTI9vv & @Flipkart.#realme9series 5G #SpeedOfLight pic.twitter.com/OUIC3nu6Lu — realme (@realmeIndia) March 10, 2022
రియల్‌మీ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఎం52, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఐకూ జెడ్5, షావోమీ 11 లైట్ ఎన్ఈ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
రియల్‌మీ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో ఇంటర్‌స్టెల్లార్, స్ట్రీమర్ పోర్ట్‌రైట్, పోర్ట్‌రైట్ స్టే కలర్, లైట్ స్పాట్ పోర్ట్‌రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రియల్‌మీ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. అజ్యూర్ గ్లో, స్టారీ గ్లో కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.