రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, రియల్‌మీ 9ఐ, రియల్‌మీ 9 ప్రో 5జీ, రియల్‌మీ 9 ప్రో ప్లస్ 5జీ మోడల్స్ రిలీజైన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా రియల్‌మీ 9 4జీ (Realme 9 4G) మోడల్ రిలీజైంది. దీంతో రియల్‌మీ 9 సిరీస్‌లో మొత్తం 6 స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz అమొలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 108మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్ కూడా రూ.20,000 బడ్జెట్‌లో (Smartphone Under Rs 20,000) రిలీజైంది.
రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. సన్ బరస్ట్ గోల్డ్, స్టార్‌గేజ్ వైట్, మెటియార్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
Mi Fan Festival: రూ.6,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.99 ధరకే... కాసేపట్లో ఫ్లాష్ సేల్
Introducing the #realme9 with: ?108MP ProLight Camera ?90Hz Super AMOLED Display ?Snapdragon™️ 680 Processor Starting at ?6GB+128GB, ₹15,999* ?8GB+128GB, ₹16,999* First Sale at 12PM, 12th April on https://t.co/HrgDJTI9vv & @Flipkart.#CaptureTheSpark *T&C Apply pic.twitter.com/rpUPljZfey
— realme (@realmeIndia) April 7, 2022
రియల్‌మీ 9 4జీ స్పెసిఫికేషన్స్
రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.4 అంగుళాల 90Hz అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఒప్పో కే10, రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్లలో ఉండటం విశేషం. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్‌తో 256జీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు.
Mi Fan Festival: ఎస్‌బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 డిస్కౌంట్... ఆఫర్ కొద్ది రోజులే
రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ Samsung ISOCELL HM6 సెన్సార్ + 8మెగాపిక్సెల్ సూపర్ వైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 108ఎంపీ మోడ్, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్‌పర్ట్, పోర్ట్‌రైట్ మోడ్, హెచ్‌డీఆర్, అల్‌ట్రావైడ్, అల్‌ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికర్నిషన్, ఏఐ బ్యూటీ, ఫిల్టర్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్, స్ట్రీట్ మోడ్, టెక్స్‌ట్ స్కానర్, టిల్ట్ షిఫ్ట్, ఫోటో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, పోర్ట్‌రైట్ మోడ్, హెచ్‌డీఆర్, బ్యూటీ మోడ్, ఫిల్టర్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్, ఫేస్ రికగ్నిషన్, ఫోటో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.