హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme 9 4G: ఏప్రిల్ 7న రియల్‌మీ 9 4G ఫోన్ లాంచ్.. రియల్‌మీ GT 2 ప్రో, ఇతర డివైజ్‌లు కూడా.. ఫీచర్ల వివరాలిలా..

Realme 9 4G: ఏప్రిల్ 7న రియల్‌మీ 9 4G ఫోన్ లాంచ్.. రియల్‌మీ GT 2 ప్రో, ఇతర డివైజ్‌లు కూడా.. ఫీచర్ల వివరాలిలా..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి రియల్‌మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 7న Realme 9 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి రియల్‌మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 7న Realme 9 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి రియల్‌మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 7న Realme 9 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

  కొత్త స్మార్ట్‌ఫోన్(New Smartphone) కొనాలనుకునే వారికి రియల్‌మీ(Realme) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 7న Realme 9 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. రియల్‌మీ ఫ్లాగ్‌షిప్ GT 2 ప్రో తో పాటు Realme 9ను ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇటీవల ధ్రువీకరించింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్, రియల్‌మీ బడ్స్ ఎయిర్(Buds ear) 3, రియల్‌మీ బుక్ ప్రైమ్‌ డివైజ్‌లను(Device) కూడా విడుదల చేయనుంది. ఇండియాలో ఈ లాంచ్ ఈవెంట్(Event) ఏప్రిల్ 7న మధ్యాహ్నం 12:30 గంటలకు (IST) ప్రారంభం కానుంది.

  రియల్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఇది 4G, కెమెరా-సెంట్రిక్ ఫోన్ అని భావిస్తున్నారు. రియల్‌మీ రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఈ ఫోన్ కెమెరా సామర్థ్యం గురించి ఒక అంచనాకు రావచ్చు. రియల్‌మీ 9 108 MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది 108 MP ప్రైమరీ కెమెరాను ఉపయోగించిన రెండో రియల్‌మీ ఫోన్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ సెన్సార్‌తో Realme 8 Pro రిలీజైంది.

  Smart Phones Under 20K: రూ.20 వేల లోపు బెస్ట్ బడ్జెట్‌ ఫోన్ కోసం చూస్తున్నారా..? ఈ మోడళ్లను పరిశీలించండి..

  కంపెనీ రియల్‌మీ 9 4Gలో 108 MP శామ్‌సంగ్ ISOCELL HM6 సెన్సార్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ప్రైమరీ కెమెరా అల్ట్రావైడ్ షూటర్, డెప్త్ లేదా మాక్రో యూనిట్‌తో వచ్చే అవకాశం ఉంది. Realme 9 4G గురించి ఇతర వివరాలు ఇంకా అందుబాటులో లేవు. అయితే ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీతో రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రియల్‌మీ 9 సిరీస్‌లో తాజా మోడల్ ఆరో స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో Realme 9i, Realme 9 5G, Realme 9 5G స్పీడ్ ఎడిషన్, Realme 9 Pro, Realme 9 Pro+ లాంచ్‌ అయ్యాయి.

  * రియల్‌మీ 9 4G స్పెసిఫికేషన్లు (అంచనా)

  ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల Super AMOLED డిస్‌ప్లేతో రావచ్చు. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు. ఇది 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. స్మార్ట్‌ఫోన్ 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

  Samsung Galaxy M32 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 పైనే డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

  * Realme 9 4G ధర (అంచనా)

  భారతదేశంలో Realme 9 4G ధర రూ. 15,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఇది మెటార్ బ్లాక్, సన్‌బర్స్ట్ గోల్డ్, స్టార్‌గేజ్ వైట్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇదే ఈవెంట్‌లో రియల్‌మే జీటీ 2 ప్రో మెడల్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు రియల్‌మీ ధ్రువీకరించింది.

  First published:

  Tags: 5G Smartphone, Budget smart phone, Technology

  ఉత్తమ కథలు