Realme 8i vs Realme 8s: రియల్‌మీ రిలీజ్ చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్

Realme 8i vs Realme 8s: రియల్‌మీ రిలీజ్ చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్ (image: Realme India)

Realme 8i vs Realme 8s 5G | రియల్‌మీ నుంచి ఒక 4జీ, ఒక 5జీ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్‌గా లాంఛ్ అయ్యాయి. రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్ల మధ్య ఉన్న తేడాలు తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ ఇండియాలో రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసింది. దీంతో రియల్‌మీ 8 సిరీస్‌లో మొత్తం 5 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో ఉన్నాయి. వచ్చే వారం రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్ 5జీ సేల్ ప్రారంభం కానుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో రియల్‌మీ 8ఐ రూ.15,000 బడ్జెట్‌లో, రియల్‌మీ 8ఎస్ 5జీ రూ.20,000 బడ్జెట్‌లో రిలీజ్ అయ్యాయి. మరి లేటెస్ట్‌గా వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఏంటీ? ఈ రెండు మొబైల్స్‌లో ఏది బెస్ట్? తెలుసుకోండి.

    డిస్‌ప్లే: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటే, రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.

    OTT Subscriptions: హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అకౌంట్స్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

    ర్యామ్, స్టోరేజ్: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో, రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

    ప్రాసెసర్: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెర్ ఉండగా, రియల్‌మీ 8ఎస్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

    రియర్ కెమెరా: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్‌లో Samsung S5KJN1 సెన్సార్‌తో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్‌రైట్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటే, రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్‌రైట్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

    Realme X7 Max 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 తగ్గింపు... తొలిసారి భారీ డిస్కౌంట్

    ఫ్రంట్ కెమెరా: రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

    బ్యాటరీ: ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. రియల్‌మీ 8ఐ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, రియల్‌మీ 8ఎస్ 5జీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

    కలర్స్: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్‌ను స్పేస్ బ్లాక్, స్పేస్ పర్పుల్ కలర్స్‌లో కొనొచ్చు. రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ యూనివర్స్ బ్లూ, యూనివర్స్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది.

    ధర: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15.999. రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999.
    Published by:Santhosh Kumar S
    First published: