Realme 8s 5G, 8i: రియల్​మీ 8 సిరీస్ నుంచి కొత్తగా మరో రెండు ఫోన్లు.. లీకైన స్పెసిఫికేషన్ల వివరాలివే..!

(image: Realme India)

రియల్​మీ 8 సిరీస్​లో కొత్తగా మరో రెండు స్మార్ట్​ఫోన్లు భారత మార్కెట్​లోకి విడుదల కానున్నాయి. రియల్​మీ 8s 5G, రియల్​మీ 8i పేర్లతో ఇవి లాంచ్​ అవ్వనున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఫోన్ల రిలీజ్​ డేట్​, ధర, స్పెసిఫికేషన్ల గురించి టెక్​ ప్రియుల్లో పెద్ద చర్చ నడుస్తోంది.

  • Share this:
రియల్​మీ 8 సిరీస్​లో కొత్తగా మరో రెండు స్మార్ట్​ఫోన్లు భారత మార్కెట్​లోకి విడుదల కానున్నాయి. రియల్​మీ 8s 5G, రియల్​మీ 8i పేర్లతో ఇవి లాంచ్​ అవ్వనున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఫోన్ల రిలీజ్​ డేట్​, ధర, స్పెసిఫికేషన్ల గురించి టెక్​ ప్రియుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ ఊహాగానాలకు తెరదించుతూ కంపెనీ సీఈవో మాధవ్​ సేథ్ కీలక ప్రకటన చేశారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియల్​మీ 8 ఎస్​, 8 ఐ రెండు ఫోన్లను సెప్టెంబర్​ 9 మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్​ చేస్తామని ప్రకటించారు. ఈ లాంచింగ్​ ఈవెంట్​లోనే రియల్‌మీ కాబుల్ స్పీకర్, రియల్‌మీ పాకెట్ స్పీకర్, రియల్‌మీ ప్యాడ్‌లను కూడా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రియల్​మీ 8 సిరీస్​లో రియల్​మీ 8, రియల్​మీ 8ప్రో, రియల్​మీ 8 5జీ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లకు ఇప్పుడు మరో రెండు ఫోన్లు జతకానున్నాయి.

రియల్​మీ 8ఐ 5జి స్పెసిఫికేషన్లు

గాడ్జెట్స్‌డేటా టిప్​స్టర్​ డెబయాన్ రాయ్.. రాబోయే రియల్‌మీ 8 ఎస్​, రియల్‌మీ 8 ఐ స్మార్ట్​ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు. లీకైన వివరాలను బట్టి చూస్తే.. రియల్​మీ 8ఐ స్మార్ట్​ఫోన్​ ఆక్టాకోర్​ మీడియాటెక్​ హీలియో జీ 96 ప్రాసెసర్​తో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6.59 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిప్లే, 4 జీబీ ర్యామ్​, 128 జీబీ ఆన్​బోర్డ్​​ స్టోరేజ్​ను అందించనున్నారు.

50MP ప్రైమరీ, రెండు 2MP సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను రియల్‌మీ అందించనుంది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 16MP ఫ్రంట్ షూటర్​ కెమెరాను చేర్చనుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 18W ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ స్పేస్ పర్పుల్, స్పేస్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

రియల్​మీ 8ఎస్​ స్పెసిఫికేషన్లు 

రియల్​మీ 8ఎస్​ 5జీ ఫోన్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 810 ప్రాసెసర్​తో పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లేను అందించనున్నారు. ఇది 6 జీబీ ర్యామ్​, 8 జీబీ ర్యామ్​ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటిలో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​ను అందించనున్నారు. దీని వెనుకవైపు 64MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలు ఉండనున్నాయి. దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP కెమెరాను అందించనున్నారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్​ యూనివర్స్ పర్పుల్, యూనివర్స్ బ్లూ కలర్ అనే రెండు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
Published by:Krishna Adithya
First published: