Realme 8 Series: రియల్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్ ప్రత్యేకతలివే

Realme 8 Series: రియల్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్ ప్రత్యేకతలివే (image: Realme India)

Realme 8 Series | రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్స్ ఇండియాలో లాంఛ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ ఇండియాలో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసింది. రియల్‌మీ 8 సిరీస్‌లో రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పటికే రియల్‌మీ 8 సిరీస్‌లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో రెండు మొబైల్స్‌ని తీసుకొచ్చింది. రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్ 5జీ మోడల్స్ లేటెస్ట్‌గా లాంఛ్ అయ్యాయి. రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15.999. సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది.

    ఇక రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. సెప్టెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈజీ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌తో రియల్‌మీ 8ఐ కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

    Vivo Y33s: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,500 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్.. రూ.2,490 ధరకే మొబైల్ కొనొచ్చు

    రియల్‌మీ 8ఐ స్పెసిఫికేషన్స్




    రియల్‌మీ 8ఐ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీబీ వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 5జీబీ స్టోరేజ్ ర్యామ్ లాగా పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పేస్ బ్లాక్, స్పేస్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది.

    రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్‌లో Samsung S5KJN1 సెన్సార్‌తో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్‌రైట్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యూటిఫికేషన్ ఫంక్షన్స్, హెచ్‌డీఆర్ మోడ్, పోర్ట్‌రైట్ మోడ్, పనోసెల్ఫీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

    Redmi 10 prime vs Redmi Note 10: ఈ రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి


    రియల్‌మీ 8ఎస్ 5జీ స్పెసిఫికేషన్స్


    రియల్‌మీ 8ఎస్ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తోపనిచేస్తుంది. ఇందులో కూడా 5జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్‌రైట్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published: