సుదీర్ఘ ప్రచారం తర్వాత రియల్మీ 8ఐ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. రియల్మీ నుంచి బడ్జెట్ సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధరను రూ.13,999 గా సంస్థ నిర్దేశించింది. భారత విపణిలో 120Hz డిస్ప్లేతో వచ్చిన చౌకైన ఫోన్‌గా ఇది నిలిచింది. ఈ డివైజ్ షియోమీకి చెందిన రెడ్మీ 10 ప్రైమ్, రెడ్మీ నోట్ 10ఎస్ లాంటి ఫోన్లకు గట్టి పోటీ ఇస్తోంది రియల్ మీ 8ఐ. ఈ మూడు స్మార్ట్ ఫోన్లు ప్రతి కస్టమర్ ఇష్టపడే ఫీచర్లు, ప్రత్యేకతలతో వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు స్మార్ట్ఫోన్ల ఫీచర్లను పోల్చి చూద్దాం.
Realme X7 Max 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 తగ్గింపు... తొలిసారి భారీ డిస్కౌంట్
ఈ మూడు ఫోన్లలో డిస్ప్లే..
రియల్మీ 8ఐ 6.6 అంగుళాల FHD+LCD డిస్ప్లేతో వచ్చింది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో 120 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉన్న ఫోన్ ఇది. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్, ఎల్సీడీ డిస్ప్లేతో రూపొందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో అందుబాటులోకి వచ్చింది. రెడ్మీ నోట్ 10ఎస్ 6.43 అంగుళాల AMOLED డిస్ప్లేతో, 60 Hz రిఫ్రెష్ రేటుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు ఫోన్లకు ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా ఉంది.
ప్రాసెసర్..
రియల్మీ 8ఐ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ ఉంది. రెడ్మీ 10 ప్రైమ్ డివైజ్‌లో మీడియాటెక్ హీలియయో జీ88 ప్రాసెసర్ ఉంది. SoC ఉన్న స్మార్ట్ పోన్ ఇదే. అయితే రెడ్మీ నోట్ 10ఎస్ స్పోర్ట్స్ హీలియో జీ95 ప్రాసెసింగ్ యూనిట్‌తో లభిస్తుంది. రెడ్మీ10 ప్రైమ్, రియల్మీ 8ఐ ఫోన్లు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లు కలిగి ఉన్నాయి. 4GB+64GB, 6GB+128GB ఇందులో ఉన్నాయి. నోట్ 10ఎస్ అయితే 6GB+128GB స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు ఫోన్లు MIUI 12.5 ఆధారిత ఆండ్రాయిడ్ 11తో పనిచేస్తాయి.
కెమెరా..
రియల్మీ 8ఐ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ కెమెరా ఆప్షన్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ షూటర్లు ఉన్నాయి. వీటితో పాటు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఇందులో ఉంది. రెడ్మీ 10 ప్రైమ్ క్వాడ్ క్యామ్ సెటప్‌తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీతో పాటు వెనుక భాగంలో 8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ లెన్సులు, ఫ్రంట్ భాగంలో 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది. నోట్ 10ఎస్ క్వాడ్ కెమెరా సెటప్ తో పాటు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. నోట్ 10ఎస్ లో 4కే వీడియో రికార్డింగ్ కాన్ఫిగరేషన్ ఉంది. మిగిలిన రెండింటిలో ఈ ఆప్షన్ లేదు.
Oppo Enco Buds: అతి తక్కువ ధరలో ఒప్పో ఎన్కో ఇయర్‌బడ్స్.. అద్భుతమైన ఫీచర్లు.. వివరాలిలా..
బ్యాటరీ..
రియల్మీ 8ఐ, రెడ్మీ నోట్ 10 స్మార్ట్ఫోన్లు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తున్నాయి. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు మాత్రం విభిన్నం. రియల్మీ 8ఐ డివైజ్‌కు 18వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయగలదు. నోట్ 10.. 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. రెడ్మీ 10 ప్రైమ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో లభిస్తుంది.
ధర..
రెడ్మీ10 ప్రైమ్ 4GB+64GB వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఇందులో 6GB+128GB వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్దేశించింది. రెడ్మీ నోట్ 10ఎస్ 6GB+64GB ధర రూ.14,999 కాగా.. 128GB వేరియంట్ ధర రూ.16,499గా ఉంది. కొత్తగా లాంచ్ అయిన రియల్మీ 8ఐ 4GB+64GB వేరియంట్ ధర రూ.13,999 కాగా.. 6GB+128GB ధర రూ.15,999గా ఉంది.
ఏది బెస్ట్..
ఈ మూడు ఫోన్లలో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. మంచి డిస్ప్లే, కెమెరా కోసం చూస్తున్నవారికి రెడ్మీ నోట్ 10 బెస్ట్ ఆప్షన్. ఇది AMOLED డిస్ప్లేతో 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం సైతం ఎక్కువే. తక్కువ ధరతో పాటు 128Hz డిస్ప్లే ఉన్న రియల్మీ 8ఐ కూడా ఆకర్షిణీయమైన ఎంపిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, Realme, Redmi, Smart phone, Technology