Home /News /technology /

REALME 8I TO POCO M2 PRO KNOW ABOUT BEST SMARTPHONES UNDER RS 15000 ON FLIPKART BIG BILLION DAYS SALE SS

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Best Smartphone under Rs 15,000 | మీరు రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days) ఈ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఉన్న మోడల్స్ ఉన్నాయి. మరి ఏఏ మోడల్స్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? రూ.10,000 నుంచి రూ.15,000 బడ్జెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. గతంలో రూ.15,000 పైన ఉన్న స్మార్ట్‌ఫోన్స్ కూడా ఇప్పుడు రూ.15,000 (Best Smartphone under Rs 15,000) లోపు లభిస్తున్నాయి. రియల్‌మీ, ఒప్పో, సాంసంగ్, మోటోరోలా లాంటి బ్రాండ్స్ నుంచి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ రూ.15,000 లోపు అయితే ఈ 12 స్మార్ట్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.

    Realme 8i: రియల్‌మీ 8ఐ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్‌లో రూ.12,999 ధరకే లభిస్తుంది. అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.1,000 లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.10,799 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు. (image: Realme India)

    Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.15,999. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో అదనంగా 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.14,999 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ సేల్ మొదలైంది... రూ.4,500 డిస్కౌంట్ పొందండి ఇలా

    Oppo A53s 5G: ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.15,990 కాగా, ఆఫర్ ధర రూ.13,490. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.12,141 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Poco M2 Pro: పోకో ఎం2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా, ఆఫర్ ధర రూ.11,999. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.10,799 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.12,499 కాగా, ఆఫర్ ధర రూ.11,999. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.10,799 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Xiaomi 11 Lite 5G NE: అమెజాన్‌లో షావోమీ 11 లైట్ 5జీ సేల్ మొదలైంది... రూ.3,500 డిస్కౌంట్

    Samsung Galaxy F22: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.12,499 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Samsung India)

    Realme Narzo 30 5G: రియల్‌మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.14,999. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.13,499 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Moto G40 Fusion: మోటో జీ40 ఫ్యూజన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా, ఆఫర్ ధర రూ.12,999. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.11,699 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Oppo A54: ఒప్పో ఏ54 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.14,990. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.12,191 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.

    Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.14,499. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి రూ.13,049 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Flipkart Big Billion Days, Mobile News, Mobiles, Motorola, Oppo, POCO, Realme, Realme Narzo, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు