• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • REALME 8 SERIES TO LAUNCH ON 2021 MARCH 24 IN INDIA KNOW EXPECTED SPECIFICATIONS SS GH

Realme 8 Series: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్ మీ 8-సిరీస్... లాంఛ్ ఎప్పుడంటే?

Realme 8 Series: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్ మీ 8-సిరీస్... లాంఛ్ ఎప్పుడంటే?

Realme 8 Series: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్ మీ 8-సిరీస్... లాంఛ్ ఎప్పుడంటే? (image: Realme India)

Realme 8 Series | రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. రియల్‌మీ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు రిలీజ్ కానున్నాయో తెలుసుకోండి.

  • Share this:
భారత్ లో అత్యుత్తమ ఫోన్లను విడుదల చేస్తోన్న సంస్థల్లో ముందు వరుసలో ఉన్న కంపెనీ రియల్మీ. త్వరలో రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. అదే రియల్ మీ 8 సిరీస్. ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్చి 24న విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేశారు కంపెనీ సీఈఓ మాధవ్ శేత్. అయితే ఇది ఏ ఫోన్ అనే విషయాన్ని కచ్చితమైన సమాచారాన్ని ఆయన తెలియజేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇది రియల్ మీ 8-సిరీసేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోన్ 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుందనే విషయాన్ని మాధవ్ తెలిపారు.

మార్చి 24న ఈ ఫోన్ విడుదల కానున్నట్లు ఈ వీడియో ద్వారా తెలియజేశారు. వీడియోను చూస్తే రియల్ మీ 8-సిరీస్ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ వీడియోలో మాధవ్ మాట్లాడుతూ..చిన్న క్లూ ఇచ్చారు. "అనంతమైన విషయాలను క్యాప్చర్ చేయాలనుకుంటున్నారా.. అయితే 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది సాధించండి. రియల్ మీ ఛాలెంజ్ స్వీకరించండి" అని ఆయన అన్నారు. మార్చి 24న ఈ సంస్థ రియల్ మీ 8-సిరీస్ ను ఆవిష్కరిస్తుందని, దీనికి 108 మెగాపిక్సెల్ కెమెరా సామర్థ్యమున్నట్లు ఈ వీడియో చూసి పలువురు అభిప్రాయపడుతున్నారు.

Smartphone under Rs 10000: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Samsung Galaxy A32: సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో ఆఫర్స్


రియల్ మీ 8-సిరీస్ గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలోనూ ఆ కంపెనీ సీఈఓ ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆయన రియల్ మీ 8-సిరీస్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని ట్వీట్ చేశారు. అయితే అది ఏ మోడల్ లో ఉంటుందో ఆయన చెప్పలేదు. రియల్ మీ 8-సిరీస్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రేర్ కెమెరా సెన్సార్ తో పాటు మరికొన్ని స్పెసిఫికేషన్లు కలిగి ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే రియల్ మీ 8 ప్రో 108 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉండే అవకాశముందని అనుకుంటున్నారు.

Vi New Plans: వొడాఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితం

Samsung Galaxy M12: భారీ బ్యాటరీతో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం12... ఫీచర్స్, ఆఫర్స్ వివరాలివే

US FCC ఈ నెలలో సిద్ధం చేసిన జాబితా ప్రకారం.. రియల్ మీ 8 ప్రో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో 65 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ తో అందుబాటులోకి రానుందని నివేదించింది. ఇది ఆండ్రాయిడ్ 11- ఆధారిత రియల్ మీ యూఐ 2.0తో నడుస్తుందని తెలిపింది. మరోవైపు నాన్ ప్రో వేరియంట్ 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ హెలియో జీ 95 SoC, 30 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయముంది. అంతేకాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు