• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • REALME 8 PRO AND REALME 8 FIRST FLASH SALE BEGINS TODAY ON FLIPKART KNOW PRICE AND SPECIFICATIONS SS

Realme 8 Pro: కాసేపట్లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో సేల్... ధర రూ.14,999 నుంచి

Realme 8 Pro: కాసేపట్లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో సేల్... ధర రూ.14,999 నుంచి

Realme 8 Pro: రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర రూ.14,999 నుంచి (image: Realme India)

Realme 8 Pro | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి బ్రాండ్స్ పోటాపోటీగా కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. రియల్‌మీ మరో రెండు స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది.

  • Share this:
    రియల్‌మీ 8 సిరీస్‌లో రియల్‌మీ 8 ప్రో, రియల్‌మీ 8 మోడల్స్‌ని రిలీజ్ చేసింది రియల్‌మీ. రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. టిల్ట్ షిఫ్ట్ లాంటి ఫీచర్స్‌తో సాంసంగ్ సెన్సార్ కెమెరా సెటప్ ఉంది. గతేడాది రిలీజ్ చేసిన రియల్‌మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌నే రియల్‌మీ 8 ప్రోలో కూడా ఉపయోగించింది కంపెనీ. 108 మెగాపిక్సెల్‌తో రిలీజ్ అయిన రియల్‌మీ 8 ప్రో ఇటీవల వచ్చిన రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. సేల్ మార్చి 25న మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

    Redmi Note 10 Pro Max: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్... రూ.1,500 డిస్కౌంట్

    POCO X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో... ప్రత్యేకతలు ఇవే


    రియల్‌మీ 8 ప్రో స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ
    రియర్ కెమెరా: 108 మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ (50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్
    కలర్స్: ఇన్ఫినైట్ బ్లూ, ఇన్ఫినైట్ బ్లాక్, ఇల్యుమినేటింగ్ యెల్లో
    ధర:
    6జీబీ+128జీబీ- రూ.17,999
    8జీబీ+128జీబీ- రూ.19,999

    WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే మెసేజెస్, ఫోటోస్ మాయమైపోతాయి

    Android Apps: ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అవుతున్నాయి... వెంటనే ఇలా చేయండి


    రియల్‌మీ 8 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
    ర్యామ్: 4జీబీ, జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ95
    రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్
    కలర్స్: సైబూర్ సిల్వర్, సైబర్ బ్లాక్
    ధర:
    4జీబీ+128జీబీ- రూ.14,999
    6జీబీ+128జీబీ- రూ.15,999
    8జీబీ+128జీబీ- రూ.16,999
    Published by:Santhosh Kumar S
    First published: