Best 5G Smartphones: బడ్జెట్ ధరలోనే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్... రూ.16,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Best 5G Smartphones: బడ్జెట్ ధరలోనే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్... రూ.16,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Best 5G smartphones under Rs 16000 | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.16,000 లోపేనా? ఈ బడ్దెట్‌లో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకోండి.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా 5జీ స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. అందుకే ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలన్నీ 5జీ స్మార్ట్​ఫోన్ల  (5G Smartphone)తయారీలో నిమగ్నమయ్యాయి. ప్రీమియం ఫోన్లలోనే కాదు బడ్జెట్ ఫోన్లలోనూ 5జీ కనెక్టివిటీని పరిచయం చేస్తున్నాయి. భారత్​లో ఇంకా 5జీ కనెక్టివిటీ అందుబాటులోకి రానప్పటికీ.. 5జీ ఫోన్లు లాంచ్​ అవుతున్నాయి. ప్రస్తుతం భారత్​లో కేవలం రూ. 16 వేలలోపు అందుబాటులో ఉన్న 5జీ బడ్జెట్​ స్మార్ట్​పోన్లను పరిశీలిద్దాం.

Realme 8 5G


రియల్​మీ 8 5జీ స్మార్ట్​ఫోన్​ కేవలం రూ. 15,499 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.5 -అంగుళాల ఫుల్-హెచ్​డీ+ డిస్‌ప్లేతో వస్తుంది ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. ఇది 18W క్విక్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్​ గల 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది మల్టిపుల్​ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Realme 8i: కాసేపట్లో రియల్‌మీ 8ఐ సేల్... హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో రూ.1,000 డిస్కౌంట్

Redmi Note 10T 5G


షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి తన నోట్ సిరీస్​లో మొదటి స్మార్ట్​ఫోన్​ అయిన నోట్​ 10టీ 5 జి ఫోన్‌ను లాంచ్​ చేసింది. ఇది కేవలం రూ. 14,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్ 10 టి 5 జి 6.5 -అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది. 18W ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Poco M3 Pro 5G


పోకో ఎం 3 ప్రో 5 జీ స్మార్ట్​ఫోన్​ రూ. 14,499 ధర వద్ద అమ్మకానికి సిద్దంగా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్​, 48- మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కూడిన డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీని అందించింది.

Redmi 10 Prime: షావోమీ ఫ్యాన్స్‌కు మరో ఛాన్స్... మరోసారి రెడ్‌మీ 10 ప్రైమ్ సేల్

Oppo A53s 5G


ఒప్పో A53s 5జీ రూ. 15,990 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ 700 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 6.52- అంగుళాల హెచ్​డీ+ డిస్‌ప్లేను అందించింది. ఒప్పో A53s 5జీ వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్​ షూటర్​ కెమెరాలను చేర్చింది. ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్​తో వస్తుంది. 17.74 గంటల వీడియో ప్లేబ్యాక్​ను అందిస్తుంది. మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Realme Narzo 30 5G


రియల్‌మీ నార్జో 30 5 జీ, రియల్‌మీ 8 5 జీ రెండింట్లోనూ దాదాపు ఒకే రకమైన ఫీచర్లు ఉంటాయి. రియల్​మీ నార్జో 30 5జి రూ. 14,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని అందించింది.
Published by:Santhosh Kumar S
First published: