రియల్మీ 7 ప్రో గ్రాండ్‌గా లాంఛైంది. అదిరిపోయే స్పెసిఫికేషన్స్‌తో సరికొత్త మోడల్‌ను రియల్మీ 7 ప్రో వచ్చేసింది. రియల్మీ 7 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే గత నెలలో వన్‌ప్లస్ నుంచి వచ్చి వన్‌ప్లస్ నార్డ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్‌తో పోలిస్తే రియల్మీ 7 ప్రో ధర కాస్త తక్కువ. సెప్టెంబర్ 14న రియల్మీ 7 ప్రో సేల్ ప్రారంభం కానుంది. రియల్మీ 7 ప్రో రిలీజ్‌తో వన్‌ప్లస్ నార్డ్‌కు పోటీ తప్పేలా లేదు. అయితే ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న పోలికలేంటీ? తేడాలేంటీ? వీటిలో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్? తెలుసుకోండి.
|
రియల్మీ 7 ప్రో |
వన్‌ప్లస్ నార్డ్ |
డిస్ప్లే |
6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే |
6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే |
ర్యామ్ |
6జీబీ, 8జీబీ |
6జీబీ, 8జీబీ, 12జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ |
128జీబీ |
64జీబీ, 128జీబీ, 256జీబీ |
ప్రాసెసర్ |
స్నాప్‌డ్రాగన్ 720జీ |
స్నాప్‌డ్రాగన్ 765జీ |
రియర్ కెమెరా |
64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా (Sony IMX682) |
48+8+5+2 మెగాపిక్సెల్ (Sony IMX586) |
ఫ్రంట్ కెమెరా |
32 మెగాపిక్సెల్ |
32+8 మెగాపిక్సెల్ |
బ్యాటరీ |
4500ఎంఏహెచ్ (65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్) |
4,115ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) |
ఆపరేటింగ్ సిస్టమ్ |
ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ |
ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10 |
సిమ్ సపోర్ట్ |
డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ |
డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ |
కలర్స్ |
మిర్రర్ సిల్వర్, మిర్రర్ బ్లూ |
బ్లూ మార్బుల్, గ్రే ఓనిక్స్ |
ధర |
6జీబీ+128జీబీ- రూ.19,999
8జీబీ+128జీబీ- రూ.21,999 |
6జీబీ+64జీబీ- రూ.24,999
8జీబీ+128జీబీ- రూ.27,999
12జీబీ+256జీబీ- రూ.29,999 |
Redmi 9A: కాసేపట్లో రెడ్మీ 9ఏ సేల్... ధర రూ.7,000 లోపే
Redmi Note 9: కాసేపట్లో రెడ్మీ నోట్ 9 సేల్... డిస్కౌంట్ పొందండి ఇలా
డిస్ప్లే: రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. వన్‌ప్లస్ నార్డ్‌లో కూడా 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం.
ర్యామ్: రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. వన్‌ప్లస్ నార్డ్ 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజైంది.
ప్రాసెసర్: రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్‌లో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్‌లో బెటర్ ప్రాసెసర్ ఉంది.
రియర్ కెమెరా: రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్‌లో 48 మెగాపిక్సెల్ Sony IMX586 క్వాడ్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలో రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌దే పైచేయి.
Oppo F17 Pro: ఒప్పో నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు... స్పెసిఫికేషన్స్ ఇవే
Nokia 5.3: రెడ్మీ, రియల్‌మీకి పోటీగా నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్... సేల్ ప్రారంభం
ఫ్రంట్ కెమెరా: ఫ్రంట్ కెమెరా: రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే, వన్‌ప్లస్ నార్డ్‌లో 32+8 మెగాపిక్సెల్ Sony IMX616 కెమెరా ఉంది. ఈ రెండు ఫోన్లలో 32 మెగాపిక్సెల్ కెమెరాలే ఉన్నా వన్‌ప్లస్ నార్డ్‌లో డ్యూయెల్ సోనీ కెమెరా ఉండటం విశేషం.
బ్యాటరీ: ఇక బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 34 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. ఇక వన్‌ప్లస్ నార్డ్‌లో 4,115ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ ఎక్కువగా ఉండటమే కాకుండా, వన్‌ప్లస్ కన్నా ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఎక్కువ.
ఆపరేటింగ్ సిస్టమ్: రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే, వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.
సిమ్ సపోర్ట్: రియల్మీ 7 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్లలో డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 5జీ స్మార్ట్‌ఫోన్. అంటే ఇండియాలో 5జీ నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత ఇదే ఫోన్లో 5జీ నెట్వర్క్ ఉపయోగించొచ్చు.
JioFiber Free Trail: జియోఫైబర్ 30 రోజులు ఫ్రీ... అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితం
Mobile Apps: మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 23 యాప్స్ డిలిట్ చేయండి
కలర్స్: రియల్మీ 7 ప్రో మిర్రర్ సిల్వర్, మిర్రర్ బ్లూ కలర్స్‌లో లభిస్తాయి. వన్‌ప్లస్ నార్డ్ బ్లూ మార్బుల్, గ్రే ఓనిక్స్ కలర్స్‌లో ఉన్నాయి.
ధర: ఇక ధర విషయానికి వస్తే రియల్మీ 7 ప్రో 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. హైఎండ్ వేరియంట్ ధర 8జీబీ+128జీబీ- రూ.21,999. వన్‌ప్లస్ నార్డ్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర రూ.29,999. అయితే 6జీబీ+64జీబీ వేరియంట్ సేల్ ఇంకా ప్రారంభం కాలేదు.