Realme 7 Pro | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్మీ నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్మీ 7 ప్రో, రియల్మీ 7 మోడల్స్‌ని పరిచయం చేసింది.
రియల్మీ అద్భుతమైన ఫీచర్స్‌తో రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. అదిరిపోయే స్పెసిఫికేషన్స్‌తో రియల్మీ 7 ప్రో మోడల్‌ను పరిచయం చేసింది. సూపర్ అమొలెడ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్... ఇలా అన్నీ అద్భుతమైన ఫీచర్స్‌తో రియల్మీ 7 ప్రో రూపొందించడం విశేషం. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్‌తో రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 34 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. రియల్మీ 7 ప్రో మోడల్‌తో పాటు రియల్మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉండటం విశేషం. రియల్మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 64 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. రియల్మీ 7 ప్రో, రియల్మీ 7 స్మార్ట్ఫోన్లలో స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. రియల్మీ 7 సేల్ సెప్టెంబర్ 10న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. ఇక రియల్మీ 7 ప్రో సేల్ సెప్టెంబర్ 14న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.