హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme 6i: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... రియల్‌మీ 6ఐ రిలీజ్

Realme 6i: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... రియల్‌మీ 6ఐ రిలీజ్

Realme 6i: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... రియల్‌మీ 6ఐ రిలీజ్
(image: Realme)

Realme 6i: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... రియల్‌మీ 6ఐ రిలీజ్ (image: Realme)

Realme 6i | రియల్‌మీ 6 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ 6ఐ మోడల్‌ని పరిచయం చేసింది కంపెనీ. స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

  ఇటీవల రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో మోడల్స్‌ని భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి పరిచయం చేసింది రియల్‌మీ. ఇప్పుడు రియల్‌మీ 6 సిరీస్‌లోనే మరో ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. రియల్‌మీ 6ఐ మోడల్‌ని మియన్మార్‌లో ఆవిష్కరించింది. రియల్‌మీ 5ఐ అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ 6ఐ ప్రస్తుతం మియన్మార్ మార్కెట్‌లోనే రిలీజ్ అయింది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఈ ఫోన్ రిలీజ్ అవుతందా లేదా అన్న స్పష్టత లేదు. అయితే గతంలో రియల్‌మీ 5ఐ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది కంపెనీ.

  రియల్‌మీ 6ఐ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 720 x 1600 పిక్సెల్స్

  ర్యామ్: 3జీబీ, 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ80

  రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా

  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్:

  కలర్స్: వైట్ మిల్క్, గ్రీన్ టీ

  ధర:

  3జీబీ+64జీబీ- సుమారు రూ.13,000

  4జీబీ+128జీబీ- సుమారు రూ.15,600

  ఇవి కూడా చదవండి:

  Smartphone: కొత్త ఫోన్ కొనాలా? మార్చి 31 లోపే తీసుకోండి... ఎందుకంటే

  Smartphone: స్మార్ట్‌ఫోన్‌పైన వైరస్‌ ఉంటుంది... క్లీన్ చేయండి ఇలా

  Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

  Paytm: గుడ్ న్యూస్... పేటీఎం యూజర్లకు డిజిటల్ డెబిట్ కార్డ్స్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు